Telugu Global
NEWS

ఏపీ రాజకీయాల్లో ‘తెలంగాణ’ వేడి

తెలంగాణలో ఎన్నికల వేడి ఏపీలో అగ్గి రాజేస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఏపీ అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగింది తెలంగాణలో.. ఈ ఎన్నికల కేంద్రంగా తెలంగాణలో టెన్షన్ నెలకొనడం సహజం. కానీ సేమ్ సీన్ అటు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద కూడా రిపీట్ అవుతోందట.. తెలంగాణ ఎన్నికల్లో విజేత ఎవరనే కోణం ఏపీ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. టీఆర్ఎస్ గెలిస్తే ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి.? ప్రజాకూటమి గెలిస్తే ఏపీ పాలిటిక్స్ […]

ఏపీ రాజకీయాల్లో ‘తెలంగాణ’ వేడి
X

తెలంగాణలో ఎన్నికల వేడి ఏపీలో అగ్గి రాజేస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఏపీ అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగింది తెలంగాణలో.. ఈ ఎన్నికల కేంద్రంగా తెలంగాణలో టెన్షన్ నెలకొనడం సహజం. కానీ సేమ్ సీన్ అటు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద కూడా రిపీట్ అవుతోందట.. తెలంగాణ ఎన్నికల్లో విజేత ఎవరనే కోణం ఏపీ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది.

టీఆర్ఎస్ గెలిస్తే ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి.? ప్రజాకూటమి గెలిస్తే ఏపీ పాలిటిక్స్ కు లాభమేంటి ? అన్న చర్చ ఏపీ రాజకీయ పార్టీలను షేక్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వర్సెస్ బాలయ్య ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామని కేటీఆర్ హెచ్చరిక జారీ చేస్తే.. రా చూసుకుందాం అని వార్నింగ్ ఇచ్చారు బాలక్రిష్ణ. దీంతో వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వేలు పెట్టడం ఖాయమనే చర్చ ఏపీలో మొదలైంది.

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి సమస్యలు తప్పవనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో సాగుతోంది. వైసీపీ మరింత విజృంభించే అవకాశాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ప్రజాకూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆంధ్రాలో టీడీపీ బలం అమాంతంగా పెరుగుతుందని చెప్పక తప్పదు. ఇదే జరిగితే వైసీపీ, జనసేనలో నిరాశ, నిసృహ ఆవహించే అవకాశాలుంటాయని ఆ పార్టీలు భయపడుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే కాదు.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ ను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికలపై ఏపీలోని పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోందట. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ గెలవద్దని టీడీపీ నాయకులు కోరుకుంటున్నారట. ఈ వేడి నాయకులను దాటి అక్కడి ప్రజల దాకా చేరింది. తెలంగాణ ఫలితాలపై ఏపీలో తూర్పు , పశ్చిమ గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా పందాలు కూడా కాస్తున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికలు తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ సెగలు పుట్టిస్తున్నాయి.

First Published:  9 Dec 2018 11:33 AM
Next Story