Telugu Global
Cinema & Entertainment

ఎల్బీ స్టేడియంలో నాని క్రికెట్ మ్యాచ్

మీరు చదివింది నిజమే.. త్వరలోనే ఎల్బీ స్టేడియంలో హీరో నాని క్రికెట్ ఆడబోతున్నాడు. లక్షలాది మంది వీక్షకుల మధ్య ఫోర్లు, సిక్సులతో స్టేడియంను హోరెత్తించబోతున్నాడు. అయితే ఇది నిజమైన క్రికెట్ కాదు. నాని కూడా అసలైన క్రికెటర్ కాదు. ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా కోసమే ఈ ఏర్పాట్లన్నీ. త్వరలోనే ఎల్బీ స్టేడియంలో ఈ సినిమాకు సంబంధించి క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ మేరకు స్టేడియం నుంచి పర్మిషన్ వచ్చేసింది. నాని క్రికెట్ ఆడే సన్నివేశాల్ని […]

ఎల్బీ స్టేడియంలో నాని క్రికెట్ మ్యాచ్
X
మీరు చదివింది నిజమే.. త్వరలోనే ఎల్బీ స్టేడియంలో హీరో నాని క్రికెట్ ఆడబోతున్నాడు. లక్షలాది మంది వీక్షకుల మధ్య ఫోర్లు, సిక్సులతో స్టేడియంను హోరెత్తించబోతున్నాడు. అయితే ఇది నిజమైన క్రికెట్ కాదు. నాని కూడా అసలైన క్రికెటర్ కాదు. ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా కోసమే ఈ ఏర్పాట్లన్నీ.
త్వరలోనే ఎల్బీ స్టేడియంలో ఈ సినిమాకు సంబంధించి క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ మేరకు స్టేడియం నుంచి పర్మిషన్ వచ్చేసింది. నాని క్రికెట్ ఆడే సన్నివేశాల్ని ఇక్కడ తీస్తారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతోంది. స్టుడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరో నాని, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ పైన కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఎల్బీ స్టేడియం షెడ్యూల్ ఉంటుంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ 19న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
First Published:  9 Dec 2018 10:34 AM IST
Next Story