ఈ షరతుతో మద్దతు సాధ్యమేనా?
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ సృష్టించిన గందరగోళంతో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఒకవేళ హంగ్ వస్తే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దానిపైనా చర్చ నడుస్తోంది. మహాకూటమికి బయట నుంచి వచ్చే మద్దతు తక్కువగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు మాత్రం అటు ఎంఐఎం, ఇటు బీజేపీ మద్దతు ఇచ్చేందుకు సై అంటున్నాయి. కాకపోతే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూనే బీజేపీ పెడుతున్న కండిషన్ కొంచెం విచిత్రంగా ఉంది. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన పార్టీ అధ్యక్షుడు […]
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ సృష్టించిన గందరగోళంతో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఒకవేళ హంగ్ వస్తే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దానిపైనా చర్చ నడుస్తోంది.
మహాకూటమికి బయట నుంచి వచ్చే మద్దతు తక్కువగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు మాత్రం అటు ఎంఐఎం, ఇటు బీజేపీ మద్దతు ఇచ్చేందుకు సై అంటున్నాయి. కాకపోతే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూనే బీజేపీ పెడుతున్న
కండిషన్ కొంచెం విచిత్రంగా ఉంది. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్…. కాకపోతే ఎంఐఎంతో టీఆర్‌ఎస్ కలవడానికి వీల్లేదన్నారు. ఎంఐఎంతో కలవని పక్షంలో టీఆర్‌ఎస్‌కు
మద్దతు ఇస్తామన్నారు. ఈ కండిషన్ బట్టి చూస్తూ టీఆర్‌ఎస్‌కు… బీజేపీ మద్దతు సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దాని బట్టి చూసినా… బీజేపీ కంటే ఎంఐఎంకే ఎక్కువ స్థానాలు వచ్చే
అవకాశం ఉంది. ఎంఐఎంకు గ్యారంటీగా ఏడు స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. కాబట్టి ఏడు సీట్లు ఉన్న ఎంఐఎంను కాదని… బీజేపీ మద్దతు కోసం టీఆర్‌ఎస్ వెంపర్లాడే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇచ్చినా ఇంకా మేజిక్ ఫిగర్‌కు మరికొందరి మద్దతు కావాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి.