Telugu Global
NEWS

లక్షా 50 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పిన జగన్‌

2014 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలి అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు క్యాలండర్ ప్రకటించి ప్రతి ఏటా నిర్ధిష్ట తేదీల్లో ఉద్యోగ భర్తీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా చేయడం […]

లక్షా 50 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పిన జగన్‌
X

2014 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలి అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు క్యాలండర్ ప్రకటించి ప్రతి ఏటా నిర్ధిష్ట తేదీల్లో ఉద్యోగ భర్తీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా లక్షా 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ఏ పథకం కింద లబ్ది కావాలన్నా దరఖాస్తు పెట్టిన 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల ద్వారా అనుమతులు ఇస్తామన్నారు జగన్. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికే వచ్చేలా చేస్తామన్నారు.

ఏపీలో ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామన్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

First Published:  8 Dec 2018 1:08 PM IST
Next Story