Telugu Global
NEWS

ప్రెస్‌మీట్‌ తర్వాత ఆఫ్‌లైన్‌లో లగడపాటి చెప్పిన విషయం

అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే తిరిగి అధికారం అని చెబుతుండగా… లగడపాటి పాటి మాత్రం అందుకు భిన్నంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీనిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక చానల్‌లో ఈ అంశంపై చర్చ జరగ్గా… టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావుతోపాటు, సీనియర్ జర్నలిస్ట్‌ యాదగిరిరెడ్డి ఆసక్తికమైన అంశాలు వెల్లడించారు. లగడపాటి సర్వే చేయించానని చెబుతున్న సర్వే సంస్థ ప్రతినిధులతో మాట్లాడగా వారు అసలు తాము సర్వేనే చేయలేదని చెప్పారని సీనియర్‌ జర్నలిస్ట్ […]

ప్రెస్‌మీట్‌ తర్వాత ఆఫ్‌లైన్‌లో లగడపాటి చెప్పిన విషయం
X

అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే తిరిగి అధికారం అని చెబుతుండగా… లగడపాటి పాటి మాత్రం అందుకు భిన్నంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీనిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక చానల్‌లో ఈ అంశంపై చర్చ జరగ్గా… టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావుతోపాటు, సీనియర్ జర్నలిస్ట్‌ యాదగిరిరెడ్డి ఆసక్తికమైన అంశాలు వెల్లడించారు.

లగడపాటి సర్వే చేయించానని చెబుతున్న సర్వే సంస్థ ప్రతినిధులతో మాట్లాడగా వారు అసలు తాము సర్వేనే చేయలేదని చెప్పారని సీనియర్‌ జర్నలిస్ట్ యాదగిరి రెడ్డి చెప్పారు. అటు గట్టు రామచంద్రరావు మరో అంశం చెప్పారు. లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలను వెల్లడించారని…ఇదంతా బెట్టింగ్ వ్యాపారం కోసమేనని ఆరోపించారు.

బెట్టింగ్ కట్టేవారు వెనక్కు వెళ్లకుండా ఉండేందుకు లగడపాటి ఈ పనిచేశారన్నారు. కాబట్టి లగడపాటి సర్వేల ఆధారంగా బెట్టింగ్‌లు కట్టేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం… ఇదే లగడపాటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వద్ద టీఆర్ఎస్‌కు 70 స్థానాలు వస్తున్నాయని స్పష్టంగా చెప్పారన్నారు.

మహాకూటమి గెలుస్తుందని తాను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని… అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని సదరు జర్నలిస్ట్ వద్ద లగడపాటి చెప్పారని గట్టు వివరించారు. సదరు సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎవరన్నది ఆఫ్‌లైన్‌లో చెప్పేందుకు కూడా తాను సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్‌ మీద, టీడీపీ మీద ప్రేమ కంటే బెట్టింగ్‌ వ్యాపారం మీద వ్యామోహమే లగడపాటి చేత ఇలా చెప్పించిందని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.

First Published:  8 Dec 2018 3:25 AM IST
Next Story