టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువే " తమ్మినేని
తెలంగాణలో తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్ పెరగడం టీఆర్‌ఎస్‌కు అనుకూలించిందన్నారు. తొలుత పోరు హోరాహోరీ అనుకున్నా ఆఖరిలో ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌కు మేజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతు ఇస్తాయని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపించిందన్నారు. సీపీఎం పోటీ చేసిన […]
తెలంగాణలో తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్ పెరగడం టీఆర్‌ఎస్‌కు అనుకూలించిందన్నారు.
తొలుత పోరు హోరాహోరీ అనుకున్నా ఆఖరిలో ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌కు మేజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతు ఇస్తాయని విశ్లేషించారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపించిందన్నారు. సీపీఎం పోటీ చేసిన 26 స్థానాల్లో ఒకటి రెండు చోట్ల గెలుపు అవకాశాలున్నాయన్నారు. బీఎల్ఎఫ్ కూటమి అభ్యర్థులు బరిలో దిగిన 81 చోట్ల రెండు మూడు సీట్లను గెలుచుకునే చాన్స్ ఉందన్నారు. పలు స్థానాల్లో బీఎల్‌ఎఫ్… టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫలితాలను తారుమారు చేయబోతోందన్నారు తమ్మినేని వీరభద్రం.