Telugu Global
Cinema & Entertainment

నిధి అగర్వాల్ తో నాగ శౌర్య రొమాన్స్

అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామ ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి. ఎందుకంటే “సవ్యసాచి” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అక్కినేని అఖిల్ సరసన “మిస్టర్ మజ్ను” సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది నిధి అగర్వాల్. ప్రస్తుతం షూటింగ్ […]

నిధి అగర్వాల్ తో నాగ శౌర్య రొమాన్స్
X

అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామ ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి. ఎందుకంటే “సవ్యసాచి” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అక్కినేని అఖిల్ సరసన “మిస్టర్ మజ్ను” సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది నిధి అగర్వాల్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జనవరి లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా తరువాత ఇప్పుడు ఈ భామకి తెలుగు లో మూడో సినిమా అవకాశం వచ్చింది. అవును యంగ్ హీరో నాగ శౌర్య నిధి అగర్వాల్ కి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. నాగ శౌర్య తన తదుపరి సినిమాని సుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శశి దర్శకత్వంలో చేస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు.

First Published:  8 Dec 2018 5:22 AM
Next Story