చంద్రబాబు వల్ల అపార నష్టం జరిగిపోయింది... అందుకే ఫొటో మాయం....
తెలంగాణలో తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతోందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి గతంలో తెలంగాణ కూడా రాదని చెప్పారని… కానీ ఆగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ దెబ్బకు ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి… 11 తర్వాత సర్వేల సన్యాసం కూడా తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 11వ తేదీన చాలా విషయాలు చెబుతానన్నారు. అన్నీ ఇప్పుడే చెబితే 11న మీడియాకు కూడా మసాలా ఉండదని కేటీఆర్ కామెంట్ చేశారు. ఓటింగ్ పూర్తి ప్రభుత్వ […]
తెలంగాణలో తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతోందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి గతంలో తెలంగాణ కూడా రాదని చెప్పారని… కానీ ఆగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ దెబ్బకు ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి… 11 తర్వాత సర్వేల సన్యాసం కూడా తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 11వ తేదీన చాలా విషయాలు చెబుతానన్నారు. అన్నీ ఇప్పుడే చెబితే 11న మీడియాకు కూడా మసాలా ఉండదని కేటీఆర్ కామెంట్ చేశారు.
ఓటింగ్ పూర్తి ప్రభుత్వ అనుకూల సరళిలో జరిగిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సీట్లతో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. వంద సీట్లతో నిశబ్ద విప్లవం రాబోతోందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 11వ తేదీన సంబరాలు చేసుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు కూడా అడియాశలు కాబోతున్నాయన్నారు. సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే నేతలు వారి సొంత నియోజకవర్గాలు దాటి బయటకు రాలేకపోయారంటేనే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఓడిపోతామనే కాంగ్రెస్ నేతలు ముందు జాగ్రత్తగా ఈవీఎంలపై నిందలేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబుతో పొత్తు వల్ల కూటమికి భారీగా నష్టం జరిగిపోయిందన్నారు. ఆ విషయం వారికి కూడా అర్థమైంది కాబట్టే ప్రచారం ముగింపుకు వచ్చే సరికి చంద్రబాబు ఫొటో లేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారన్నారు.
దీన్ని బట్టే చంద్రబాబు రావడంతో మహాకూటమికి అపారమైన నష్టం జరిగిపోయిందన్నారు. పడే ఓట్లు కూడా పడవేమోనన్న భయంతో ఆఖరిలో చంద్రబాబు ఫొటోను కూడా మాయం చేశారన్నారు. కోట్లాది రూపాయలను మహాకూటమి కుమ్మరించిందన్నారు.
కాంగ్రెస్ నేతల తరహాలో వ్యవస్థలపై, అధికారుల పైన తమకు పనికిమాలిన అనుమానాలు ఏమీ లేవన్నారు. మీడియా కథలు రాసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. మీడియా కథల వల్ల ప్రజల్లో మార్పు ఏమీ రాదన్నారు.