Telugu Global
International

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా.... 10మిలియన్ యూరోలు చెల్లించాలని ఆదేశాలు!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌కు మరోసారి గట్టి షాక్ తగిలింది. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌….ఇప్పటికే పలు దేశాల్లో జరిమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇటలీ కూడా ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది. యూజర్ల పర్మిషన్ లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ….యూజర్ల భద్రత చట్టాలను పరిరక్షించే కాంపిటిషన్ అథారిటీ ఏజీసీఎం… ఫేస్‌బుక్‌కు 10మిలియన్ యూరోలు(దాదాపు రూ.80కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఖాతాలు తెరవడంలో యూజర్లను ఫేస్‌బుక్‌ తప్పుదోవ పట్టిస్తోంది. యూజర్లు […]

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా.... 10మిలియన్ యూరోలు చెల్లించాలని ఆదేశాలు!
X

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌కు మరోసారి గట్టి షాక్ తగిలింది. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌….ఇప్పటికే పలు దేశాల్లో జరిమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇటలీ కూడా ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది.

యూజర్ల పర్మిషన్ లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ….యూజర్ల భద్రత చట్టాలను పరిరక్షించే కాంపిటిషన్ అథారిటీ ఏజీసీఎం… ఫేస్‌బుక్‌కు 10మిలియన్ యూరోలు(దాదాపు రూ.80కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఖాతాలు తెరవడంలో యూజర్లను ఫేస్‌బుక్‌ తప్పుదోవ పట్టిస్తోంది.

యూజర్లు ఇచ్చే డేటాను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటూ…. ఆ సమాచారాన్ని ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు ముందుగా చెప్పడం లేదు. అంతేకాదు తమ సేవలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఇతర కంపెనీలకు విక్రయిస్తోందని ఏజీసీఎం ఆరోపించింది. ఇందుకుగానూ 10 మిలియన్ యూరోలు చెల్లించాలని ఫేస్‌బుక్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఫేస్‌బుక్‌ మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. ఖాతాదారుల డేటాను విక్రయించడంలేదని చెబుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సమయంలో కోట్లాది మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి వినియోగదారుల సమాచారన్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

First Published:  8 Dec 2018 3:03 AM GMT
Next Story