Telugu Global
NEWS

బాలకృష్ణకు ఎదురుదెబ్బ

వైసీపీలోకి మైనార్టీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైసీపీలో చేరారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేస్తున్నారని అబ్దుల్ గని విమర్శించారు. టీడీపీలో తాను 30 ఏళ్ల పాటు పనిచేసినా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. మైనార్టీలకు వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారని వ్యాఖ్యానించారు. అబ్దుల్‌ గని 2009లో టీడీపీ తరపున హిందూపురం […]

బాలకృష్ణకు ఎదురుదెబ్బ
X

వైసీపీలోకి మైనార్టీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైసీపీలో చేరారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు.

మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేస్తున్నారని అబ్దుల్ గని విమర్శించారు. టీడీపీలో తాను 30 ఏళ్ల పాటు పనిచేసినా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. మైనార్టీలకు వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారని వ్యాఖ్యానించారు.

అబ్దుల్‌ గని 2009లో టీడీపీ తరపున హిందూపురం నుంచి గెలుపొందారు. 2014లో బాలకృష్ణ రావడంతో అబ్దుల్‌ గనికి టికెట్ దక్కలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని గనికి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కానీ బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత అబ్దుల్‌ గనిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

తన పీఏల ద్వారానే బాలకృష్ణ పాలన సాగించారు. తన కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి అని తెలిసినా అబ్దుల్‌ గని విషయంలో బాలకృష్ణ ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. దీంతో అబ్దుల్‌ గని పార్టీ మారారు.

ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా నవీన్‌ నిశ్చల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారు?, ఏ ప్రతిపాదికపై అబ్దుల్ గని వైసీపీలో చేరారు అన్నది తేలాల్సి ఉంది.

First Published:  8 Dec 2018 4:27 AM IST
Next Story