Telugu Global
National

బీజేపీ నాయకుడి ఇంట్లో ఈవీఎం మెషీన్.... రిటర్నింగ్ అధికారి తొలగింపు

రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకుడి ఇంట్లో ఈవీఎం మెషిన్ లభ్యం కావడం కలకలం రేపింది. పాలి నియోజకవర్గానికి కేటాయించిన మెషిన్లలో ఒక రిజర్వుడు ఈవీఎం సదరు బీజేపీ నాయకుడి ఇంట్లో లభ్యం అయ్యింది. ఈవీఎం బయట దొరికిందన్న విషయం తెలుసుకున్న ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఒక సెక్టార్ అధికారి ఈవీఎంను మోసుకుంటూ బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. వెంటనే పాలి రిటర్నింగ్ అధికారి మహావీర్‌ను ఎన్నికల విధుల నుంచి […]

బీజేపీ నాయకుడి ఇంట్లో ఈవీఎం మెషీన్.... రిటర్నింగ్ అధికారి తొలగింపు
X

రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకుడి ఇంట్లో ఈవీఎం మెషిన్ లభ్యం కావడం కలకలం రేపింది. పాలి నియోజకవర్గానికి కేటాయించిన మెషిన్లలో ఒక రిజర్వుడు ఈవీఎం సదరు బీజేపీ నాయకుడి ఇంట్లో లభ్యం అయ్యింది.

ఈవీఎం బయట దొరికిందన్న విషయం తెలుసుకున్న ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఒక సెక్టార్ అధికారి ఈవీఎంను మోసుకుంటూ బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. వెంటనే పాలి రిటర్నింగ్ అధికారి మహావీర్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించి అక్కడి నుంచి బదిలీ చేసింది.

అధికారులు చేసిన తనిఖీలో బీజేపీ నాయకుడి ఇంటి నుంచి ఈవీఎంను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఈవీఎంను ఎన్నికల్లో వాడకూడదని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియ ముగియకముందే జోధ్‌పూర్ నుంచి రాకేష్ అనే అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు ఈసీ తెలిపింది.

బీజేపీ నాయకుడి ఇంట్లో ఖాళీగా పడి ఉన్న ఈవీఎంకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరోవైపు రాజస్థాన్‌లోని కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో రోడ్డుపై బ్యాలెట్ యూనిట్ కనపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులను సస్పెండ్ చేశారు. సదరు బ్యాలెట్ యూనిట్‌ను స్ట్రాంగ్ రూంకు తరలించారు.

First Published:  8 Dec 2018 1:55 AM GMT
Next Story