Telugu Global
NEWS

కేసీఆర్ చరిత్రను తిరగ రాయబోతున్నారా? ముందస్తుకు వెళ్లి ఓడిన కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు!

తెలంగాణలో ఓటింగ్ పర్వం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపే మిగిలింది. విజయం మాదంటే మాదంటూ టీఆర్ఎస్, మహాకూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 11న గెలుపోటములకు తెరపడనుంది. విజయం ఎవర్ని వరిస్తుందో తేలనుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం కూడా తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడినాక…. కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లారు. మరి ఈ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా? […]

కేసీఆర్ చరిత్రను తిరగ రాయబోతున్నారా? ముందస్తుకు వెళ్లి ఓడిన కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు!
X

తెలంగాణలో ఓటింగ్ పర్వం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపే మిగిలింది. విజయం మాదంటే మాదంటూ టీఆర్ఎస్, మహాకూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 11న గెలుపోటములకు తెరపడనుంది. విజయం ఎవర్ని వరిస్తుందో తేలనుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం కూడా తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడినాక…. కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లారు. మరి ఈ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా?

చరిత్రను చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డితోపాటు టీడీపీ అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబులు ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లపడ్డారు. ఈ నేపథ్యంలోనే 9నెలలు ముందుగానే ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ చరిత్రను తిరగరాస్తారా? లేదా వారిలాగే ఓటమి పాలవుతారా? ఇప్పుడు ఇది తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

ముందస్తు ఎన్నికలు ఎలాంటి సందర్భాల్లో జరుగుతాయి….

ముందస్తు ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు ప్రభుత్వం రద్దు కావడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు రాజకీయ ప్రయోజనాలను ఆశించి, అధికార పార్టీలు ముందస్తుకు వెళ్తుంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1983లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలు జనవరిలోనే పెట్టించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 202 స్థానాలు గెలుచుకుని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

1990మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా…. నాలుగు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్టీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. తర్వాత 2003లో చంద్రబాబు అలిపిరి ఘటనతో ముందస్తుకు వెళ్లారు. సానుభూతి గెలుస్తుందని భ్రమపడిన చంద్రబాబుకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.

ఈవిధంగా ఆంధ్రప్రదేశలో జరిగిన మూడు ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది. కానీ తెలంగాణకు జరిగిన ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని…. కేసీఆర్ చరిత్రను తిరగరాయటం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు ఖరాఖండిగా చెబుతున్నాయి. ఈ ఉత్కంఠతకు తెరపడాలంటే….ఈనెల 11న వెలువడనున్న ఫలితాలను చూడాల్సిందే.

First Published:  8 Dec 2018 12:10 PM GMT
Next Story