సర్జికల్ స్ట్రైక్స్‌కు అంత ప్రచార ఆర్భాటం అవసరం లేదు " ఆపరేషన్‌ను లైవ్‌లో చూసిన ఆర్మీ అధికారి
ఉరీలో భారత సైన్యంపై పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 29 సెప్టెంబర్ 2016లో చేసిన సర్జికల్ దాడిపై మాజీ లెఫ్టెనెంట్ జనరల్ డీఎస్ హుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భూభాగంలోనికి చొచ్చుకొని పోయి భారత సైన్యం సర్జికల్ దాడిని విజయవంతంగా పూర్తి చేయడం మంచిదే. అప్పట్లో ఆ విజయాన్ని గొప్పగా చెప్పుకోవడం సహజమే… కాని ఇప్పటికీ దాన్నో ఘనతగా ప్రచారం చేసుకోవడం అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఉరి ఘటనలో 19 […]
ఉరీలో భారత సైన్యంపై పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 29 సెప్టెంబర్ 2016లో చేసిన సర్జికల్ దాడిపై మాజీ లెఫ్టెనెంట్ జనరల్ డీఎస్ హుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భూభాగంలోనికి చొచ్చుకొని పోయి భారత సైన్యం సర్జికల్ దాడిని విజయవంతంగా పూర్తి చేయడం మంచిదే. అప్పట్లో ఆ విజయాన్ని గొప్పగా చెప్పుకోవడం సహజమే… కాని ఇప్పటికీ దాన్నో ఘనతగా ప్రచారం చేసుకోవడం అనవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఉరి ఘటనలో 19 మంది భారత సైనికులు మరణించిన తర్వాత ఆ ముష్కరులను అంతం చేయడానికి భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ఆకస్మిక దాడులు చేసింది. ఆ సమయంలో నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా హుడా పని చేశారు. ఆ దాడులను ప్రత్యక్షంగా ఆయన వీక్షించారు. అంతే కాదు ఉరి ఘటన తర్వాత ప్రత్యేక దళాలు చేసిన దాడి ప్రణాళికను ఆయనే అమోదించారు.
ఇటీవల చండీఘర్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివెల్‌లో ‘సీమాంతర కార్యాకలాపాల పాత్ర మరియు ఆకస్మిక దాడులు’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ విజయం పూర్తిగా రాజకీయం చేయబడింది అన్నారు. సైన్యం నిర్వహించే ఆపరేషన్స్‌ను రాజకీయం చేయడం చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
హుడా వ్యాఖ్యలపై ప్రస్తుత ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమే అన్నారు. ఈ విషయంపై నేనేమీ కామెంట్ చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. అయితే ఆయన ఇలాంటి ఆపరేషన్స్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆర్మీ అధికారి అని, వ్యక్తిగతంగా ఆయన మాటలను గౌరవిస్తున్నానని జనరల్ బిపిన్ రావత్ అన్నారు.