Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో 82 సంవత్సరాల రికార్డు పటాపంచలు

1936లో క్లారీ…2018లో యాసిర్ షా అత్యంత వేగంగా 200 వికెట్ల మొనగాడు యాసిర్ షా 33 టెస్టుల్లోనే 200 వికెట్ల మొనగాడు యాసిర్ షా చార్లీ గ్రిమెట్ రికార్డును అధిగమించిన యాసిర్ షా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో…ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ పేరుతో ఉన్న 82 సంవత్సరాల రికార్డు ఎట్టకేలకు బద్ధలయ్యింది. 13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా…క్లారీ గ్రిమ్మెట్ గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు. […]

టెస్ట్ క్రికెట్లో 82 సంవత్సరాల రికార్డు పటాపంచలు
X
  • 1936లో క్లారీ…2018లో యాసిర్ షా
  • అత్యంత వేగంగా 200 వికెట్ల మొనగాడు యాసిర్ షా
  • 33 టెస్టుల్లోనే 200 వికెట్ల మొనగాడు యాసిర్ షా
  • చార్లీ గ్రిమెట్ రికార్డును అధిగమించిన యాసిర్ షా

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో…ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ పేరుతో ఉన్న 82 సంవత్సరాల రికార్డు ఎట్టకేలకు బద్ధలయ్యింది. 13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా…క్లారీ గ్రిమ్మెట్ గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు.

1936లో జోహెన్స్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో…తన 36వ టెస్ట్ మ్యాచ్ ఆడిన క్లారీ…అదే మ్యాచ్ లో 200వ టెస్ట్ వికెట్ సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతితక్కువ టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు. నాటినుంచి నేటివరకూ క్లారీ రికార్డే కొనసాగుతూ వచ్చింది.

అప్పుడు క్లారీ…. ఇప్పుడు యాసిర్….

అబూదాబీ షేక్ జాయేద్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన టెస్ట్ మ్యాచ్ ద్వారా…పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా…అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ క్లారీ గ్రిమ్మెట్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు.

క్లారీ 36 మ్యాచ్ ల్లో 200 వికెట్లు సాధిస్తే…యాసిర్ షా 33 టెస్టుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో…యాసిర్ షా ఏకంగా 27 వికెట్లు పడగొట్టి…. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

ఐదు సీజన్లు…200 వికెట్లు…

2014 సీజన్లో ఆస్ట్రేలియా పై టస్ట్ అరంగేట్రంలోనే 7 వికెట్లు సాధించిన యాసిర్… తొమ్మిది టెస్టుల్లో 50 వికెట్లు, 17 టెస్టుల్లోనే 100 వికెట్ల రికార్డును పూర్తి చేశాడు.

ఆ తర్వాతి 16 టెస్టుల్లోనే యాసిర్ 200 వికెట్ల రికార్డును సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

క్లారీ గ్రిమ్మెట్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డు బద్ధలు కావటానికి 82 సంవత్సరాలు పడితే…ఇప్పుడు యాసిర్ షా పేరుతో ఉన్న రికార్డు తెరమరుగుకావటానికి మరెన్ని సంవత్సరాలు పడుతుందో మరి.

First Published:  7 Dec 2018 4:57 AM IST
Next Story