టీఆర్‌ఎస్ వల్లే చెన్నైలో తలదాచుకుంటున్నా- శ్రీరెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది దొరపాలన అని విమర్శించారు. ఎదురు తిరిగిన వారిపై కక్ష సాధింపుకు దిగుతోందని ఆరోపించారు. అందుకు రేవంత్ రెడ్డి పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమన్నారు. ఎదురు తిరిగిన వారిని అంతుచూడడం టీఆర్‌ఎస్ కు అలవాటు అని విమర్శించారు. తనకు ఆపద వచ్చినప్పుడు స్పందించాలని కేసీఆర్, కేటీఆర్, కవితను కోరినా స్పందించలేదని మండిపడ్డారు. పార్క్‌హయత్ హోటల్‌లో ఏం జరిగిందో, ఆ హోటల్‌కు అమ్మాయిలు ఎవరి కోసం […]
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది దొరపాలన అని విమర్శించారు. ఎదురు తిరిగిన వారిపై కక్ష సాధింపుకు దిగుతోందని ఆరోపించారు.
అందుకు రేవంత్ రెడ్డి పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమన్నారు. ఎదురు తిరిగిన వారిని అంతుచూడడం టీఆర్‌ఎస్ కు అలవాటు అని విమర్శించారు. తనకు ఆపద వచ్చినప్పుడు స్పందించాలని కేసీఆర్, కేటీఆర్, కవితను కోరినా స్పందించలేదని మండిపడ్డారు.
పార్క్‌హయత్ హోటల్‌లో ఏం జరిగిందో, ఆ హోటల్‌కు అమ్మాయిలు ఎవరి కోసం వచ్చారో అంతా కేసీఆర్‌కు తెలుసని అందుకే స్పందించలేదన్నారు. హైదరాబాద్ వదిలేసి చెన్నైలో తాను తలదాచుకునే పరిస్థితిని టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తెచ్చిందన్నారు.
పార్క్ హయత్ హోటల్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో.. ఎంత మంది అమ్మాయిలను తీసుకొచ్చి వాడుకుంటున్నారో తెలియదా అని నిలదీశారు. అసలు డ్రగ్ కేసును ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ అన్యాయాన్ని భరించలేక నడిరోడ్డుపై బట్టలు విప్పేసినా కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని శ్రీరెడ్డి విమర్శించారు.
శ్రీరెడ్డి ఏమైనా మాట్లాడితే విలువలు లేని అమ్మాయి అని నిరూపించేందుకు ఐటీ శాఖను చేతిలో పెట్టుకుని పనిచేశారని శ్రీరెడ్డి ఆరోపించారు. మహాకూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. తాను మహాకూటమికే సపోర్టు చేస్తున్నట్టు చెప్పారు.
టీఆర్ఎస్‌లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్ప మరొకరు ఎవరైనా కనిపిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హిట్లర్ పాలనను టీఆర్‌ఎస్ నేతలు కూడా మరోదారి లేక సహిస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించారు. లేడీస్ లేకుండా కొడుక్కు నిద్రపట్టదు… మందు లేకుండా తండ్రికి నిద్ర పట్టదు, కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదని…నిద్రపోతున్న తెలంగాణ మేలుకో అని శ్రీరెడ్డి పిలుపునిచ్చారు.