మేకప్ టెస్ట్ పూర్తి.. మారిన సమంత
ఇప్పటివరకు సమంత చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా మరో ఎత్తు. అదే మిస్ గ్రానీ రీమేన్. సౌత్ కొరియాలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. నందినీరెడ్డి డైరక్షన్ లో ఈమధ్యే ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి సమంతపై నిన్న మేకప్ టెస్ట్ పూర్తయింది. 75 ఏళ్ల బామ్మగా ఆమెను […]
BY admin7 Dec 2018 7:05 AM IST
X
admin Updated On: 7 Dec 2018 7:05 AM IST
ఇప్పటివరకు సమంత చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా మరో ఎత్తు. అదే మిస్ గ్రానీ రీమేన్. సౌత్ కొరియాలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. నందినీరెడ్డి డైరక్షన్ లో ఈమధ్యే ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి సమంతపై నిన్న మేకప్ టెస్ట్ పూర్తయింది. 75 ఏళ్ల బామ్మగా ఆమెను మేకప్ చేసి ఓ లుక్ ను ఫిక్స్ చేశారు. బామ్మ లుక్ కోసం 3 గెటప్స్ ప్రయత్నించి, చివరాఖరికి ఒకటి ఫిక్స్ చేశారు. ఆ గెటప్ తోనే సినిమాలో 75 ఏళ్ల బామ్మగా కనిపించనుంది సమంత.
త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కింద సమంత ముసలి గెటప్ నే విడుదల చేయాలని నిర్ణయించారు. అలా చేయడం వల్ల సినిమాకు బజ్ వస్తుందని భావిస్తున్నారు. 75 ఏళ్ల బామ్మ అనుకోకుండా 20 ఏళ్ల పడుచుపిల్లగా మారితే ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ.
Next Story