Telugu Global
Health & Life Style

పది నిమిషాల్లోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు! వ్యాధి నియంత్రణ దిశగా ముందడుగు!

ఎలాంటి వ్యాధినైనా తొలినాళ్లలో గుర్తించడం చాలా ముఖ్యం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడం మరింత అవసరం. ఎంత తొందరగా వ్యాధి నిర్థారణకు వస్తే…ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణం వ్యాధికి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవడం…. వ్యాధిని గుర్తించక పోవడం. వ్యాధి ముదిరిన దశలో గుర్తించడం ద్వారా పరిస్థితులు చేజారిపోతున్నాయి. క్యాన్సర్ నియంత్రణ దిశగా ముందడుగు వేశారు ఆస్ట్రేలియాలోని […]

పది నిమిషాల్లోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు! వ్యాధి నియంత్రణ దిశగా ముందడుగు!
X

ఎలాంటి వ్యాధినైనా తొలినాళ్లలో గుర్తించడం చాలా ముఖ్యం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడం మరింత అవసరం. ఎంత తొందరగా వ్యాధి నిర్థారణకు వస్తే…ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇందుకు కారణం వ్యాధికి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవడం…. వ్యాధిని గుర్తించక పోవడం. వ్యాధి ముదిరిన దశలో గుర్తించడం ద్వారా పరిస్థితులు చేజారిపోతున్నాయి. క్యాన్సర్ నియంత్రణ దిశగా ముందడుగు వేశారు ఆస్ట్రేలియాలోని క్విన్స్ లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పదినిమిషాల్లోనే క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని పరీక్షించి చూశారు.

ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తారంటే….

సాధారణంగా రక్త పరీక్షతో క్యాన్సర్ సోకిందా లేదా అనేది నిర్ధారిస్తారు. క్యాన్సర్ డిఎన్ఏ, క్యాన్సర్ లేని డిఎన్ఏ ను నీటిలో ఉంచినప్పుడు ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. క్యాన్సర్ కణాల నుంచి తీసిన డిఎన్ఏను పరీక్షలో ఉపయోగించినట్లయితే…నీరు తన అసలు రంగును కోల్పోదు. ఎందుకంటే డిఎన్ఏ గోల్డ్ నానోపార్టికల్స్ అంటుకుని ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాల నుంచి తీసిన డిఎన్ఏను పరీక్షలో ఉపయోగించినట్లయితే…డిఎన్ఏ నానోపార్టికల్స్ కు భిన్నంగా ఉండటంతోపాటు… నీరంతా నీలంగా మారుతుంది.

లీడ్ , మాట్ ట్రూ పరిశోధకుల అనుచరులు ఇప్పటివరకు 200 మానవుల క్యాన్సర్ నమూనాలు సేకరించి… ఆరోగ్యకరమైన డిఎన్ఏపై 10నిమిషాలు పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం అయ్యింది.

రొమ్ము, లింఫోమా, ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన క్యాన్సర్ కారకాలను గుర్తించడానికి ఉపయోగపడింది. ఈ ప్రయోగంతోనే ఇతర క్యాన్సర్లను గుర్తించవచ్చని చెబుతున్నారు. అయితే ఈ టెస్ట్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఈ పరీక్ష అందరికీ అందుబాటులోకి రావాలంటే ముందు క్లినికల్ ట్రయల్స్ అవసరం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు సార్వత్రిక రక్తపరీక్ష విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధించారనే చెప్పవచ్చు.

First Published:  7 Dec 2018 3:47 AM IST
Next Story