చిత్రలహరి ఓవర్సీస్ డీల్ క్లోజ్
సాయిధరమ్ తేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అతడి సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆడడం లేదు. ఇలాంటి టైమ్ లో అతడి సినిమాకు ఇక్కడ మార్కెట్ జరగడం కూడా చాలా కష్టం. కానీ ఆశ్చర్యకరంగా సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ చిత్రలహరి ఓవర్సీస్ డీల్ లాక్ అయింది. సరిగమ సినిమాస్ అనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, చిత్రలహరి ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది. దీని వెనక ఓ బలమైన కారణం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ తో సరిగమకు […]

సాయిధరమ్ తేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అతడి సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆడడం లేదు. ఇలాంటి టైమ్ లో అతడి సినిమాకు ఇక్కడ మార్కెట్ జరగడం కూడా చాలా కష్టం. కానీ ఆశ్చర్యకరంగా సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ చిత్రలహరి ఓవర్సీస్ డీల్ లాక్ అయింది.
సరిగమ సినిమాస్ అనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, చిత్రలహరి ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది. దీని వెనక ఓ బలమైన కారణం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ తో సరిగమకు మంచి అనుబంధం ఉంది. ఒక విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలదే అని చెబుతుంటారు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా భారీ రేటుకు చిత్రలహరి రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు బిజినెస్ కష్టమే. తేజూ గత సినిమాలతో కంపేర్ చేసి చూస్తే, చిత్రలహరి బిజినెస్ కనిష్ట స్థాయికి పడిపోయింది. కేవలం మైత్రీ మూవీ మేకర్స్ పై ఉన్న నమ్మకంతోనే బిజినెస్ జరగాలి. రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి సినిమాలతో ఈ నిర్మాణ సంస్థపై కూడా నమ్మకం సన్నగిల్లింది. మరి ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎలా చేస్తారో చూడాలి.