Telugu Global
NEWS

తెలంగాణ ఎన్నికల్లో బాబు ప్రచారంపై జగన్ కామెంట్స్‌

మంత్రి కళా వెంకట్రావ్ చంద్రబాబు వద్ద కాకాలు పడుతూ కాకా వెంకట్రావ్‌గా మారారన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం చిలకపాలెం బహిరంగసభలో ప్రసంగించిన జగన్‌…. మంత్రి కళా వెంకట్రావ్‌పై ఫైర్ అయ్యారు. కళా వెంకట్రావ్‌ను ఇక్కడి ప్రజలు కమిషన్ వెంకట్రావ్‌ అని అంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరాలు అడే బ్రోకర్ కళా వెంకట్రావ్‌ అని జగన్ విమర్శించారు. రాష్ట్రం సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు మాత్రం సొంత రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినట్టుగా […]

తెలంగాణ ఎన్నికల్లో బాబు ప్రచారంపై జగన్ కామెంట్స్‌
X

మంత్రి కళా వెంకట్రావ్ చంద్రబాబు వద్ద కాకాలు పడుతూ కాకా వెంకట్రావ్‌గా మారారన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం చిలకపాలెం బహిరంగసభలో ప్రసంగించిన జగన్‌…. మంత్రి కళా వెంకట్రావ్‌పై ఫైర్ అయ్యారు. కళా వెంకట్రావ్‌ను ఇక్కడి ప్రజలు కమిషన్ వెంకట్రావ్‌ అని అంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరాలు అడే బ్రోకర్ కళా వెంకట్రావ్‌ అని జగన్ విమర్శించారు.

రాష్ట్రం సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు మాత్రం సొంత రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినట్టుగా తెలంగాణలో తిరుగుతున్నారని జగన్‌ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నమ్మక ద్రోహులు, అమ్ముడుపోయారు… చిత్తుగా ఓడించండి అని హైదరాబాద్‌లో చంద్రబాబు మాట్లాడారని జగన్ గుర్తు చేశారు.

పార్టీ ఫిరాయించిన ద్రోహులకు ఓట్లేయవద్దని తెలంగాణలో చెబుతున్న చంద్రబాబు… మరీ ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నది ఎవరో చెప్పాలన్నారు. అందులో నలుగురు ఎమ్మెల్యేలను మంత్రులు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏపీలో ఇంత అన్యాయం చేసిన చంద్రబాబు పక్క రాష్ట్రానికి వెళ్లి నీతిమంతుడిగా మాట్లాడుతుంటే ఇక రాజకీయాల్లో విలువలు ఎక్కడున్నాయని జగన్ ప్రశ్నించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అబద్దాలు చెప్పడంలో ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టారని జగన్‌ ఎద్దేవా చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు తానే నిర్మించానని కథలు చెప్పారని జగన్ విమర్శించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు 2005 మార్చిలో మొదలై… 2008 మార్చిలో పనులు పూర్తి అయ్యాయన్నారు. ఆసమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్‌ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు పనులు 2005 డిసెంబర్‌లో ప్రారంభమై పనులు పూర్తి అయింది వైఎస్‌ హయాంలో కాదా అని నిలదీశారు. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించింది వైఎస్‌ హయాంలో కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో ఐటీ వృద్ధి రేటు ఎనిమిది శాతంగా ఉంటే… వైఎస్‌ హయాంలో 14 శాతానికి చేరిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను అమ్మడం మాత్రమే జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 54 ప్రభుత్వ సంస్థలను ఇష్టమొచ్చిన రేటుకు తన బినామీలకు అమ్మేశారని జగన్‌ విమర్శించారు. సెల్‌ఫోన్‌ కనిపెట్టడంతో పాటు నాదెళ్ల సత్యకు కంప్యూటర్‌ టైపింగ్ నేర్పించానని, పీవీ సింధూకు బాడ్మింటన్‌ నేర్పించానంటూ పిట్టల దొరలా చంద్రబాబు కథలు చెబుతున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు.

First Published:  6 Dec 2018 1:11 PM IST
Next Story