రేవంత్ ఎలా సీఎం అవుతారు?..నాకు సీఎం పదవి నోటి దాకా వచ్చి పోయింది- వీహెచ్
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి పై 50 మంది పోలీసులు దాడి చేసి సోదాలు చేయడం ఎంతవరకు సమంజసమని వీహెచ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు అంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని ఓడించేందుకు పోలీసులు టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటిపై, ప్రగతి భవన్‌లో తనిఖీలు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులను ప్రోత్సహించి చెడ్డపేరు తెచ్చుకోవద్దని తాను […]
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి పై 50 మంది పోలీసులు దాడి చేసి సోదాలు చేయడం ఎంతవరకు సమంజసమని వీహెచ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు అంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని ఓడించేందుకు పోలీసులు టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటిపై, ప్రగతి భవన్‌లో తనిఖీలు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు.
ఇలాంటి పనులను ప్రోత్సహించి చెడ్డపేరు తెచ్చుకోవద్దని తాను పోలీసులకు సూచిస్తున్నానని వీహెచ్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీహెచ్ అభ్యంతరం తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఎప్పుడూ రెడ్లే ముఖ్యమంత్రులు కావాలా అని వీహెచ్ నిలదీశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడానికి గులాం నబీ ఆజాద్ ఎవరని వీహెచ్ మండిపడ్డారు. తాను సీఎం అభ్యర్థిగా ఉన్నానని సర్వే సత్యనారాయణ ప్రకటించుకోవడాన్ని కూడా వీహెచ్ తప్పుపట్టారు. తనకు తానుగా సీఎం అభ్యర్థి అని సర్వే ఎలా ప్రకటించుకుంటారని నిలదీశారు. తాను పార్టీలో అత్యంత సీనియర్ అని, గతంలోనూ ముఖ్యమంత్రి పదవి నోటిదాక వచ్చి పోయిందని వీహెచ్ ఆవేదన చెందారు.