Telugu Global
NEWS

15 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ....

టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశం అవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. వీరంతా తమ పట్ల పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న వారే. తమను టీడీపీ నాయకత్వం అనుమానాస్పదంగా చూస్తోందని… అణుక్షణం తమపై నిఘా కొనసాగిస్తున్నారన్నది ఈ 15 మంది ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇటీవల 15 మంది విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో సమావేశమై తమకు ఎదురవుతున్న అనుభవాలను పంచుకున్నారు. అధినాయకత్వం అనుమానాస్పదంగా చూస్తున్న […]

15 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ....
X

టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశం అవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. వీరంతా తమ పట్ల పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న వారే. తమను టీడీపీ నాయకత్వం అనుమానాస్పదంగా చూస్తోందని… అణుక్షణం తమపై నిఘా కొనసాగిస్తున్నారన్నది ఈ 15 మంది ఎమ్మెల్యేల ఆరోపణ.

ఈ నేపథ్యంలో ఇటీవల 15 మంది విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో సమావేశమై తమకు ఎదురవుతున్న అనుభవాలను పంచుకున్నారు. అధినాయకత్వం అనుమానాస్పదంగా చూస్తున్న ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే.

గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మరికొందరిపైనా నిఘా కొనసాగుతోంది. ఇంటిలిజెన్స్‌తో పాటు, పార్టీ పరంగానూ వారిపై నిఘా కొనసాగిస్తున్నారు. చివరకు గన్‌మెన్లను కూడా తమపై నిఘా కోసం వాడుతున్నారని ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమకు సంబంధించిన ప్రతి కదలికను పరిశీలిస్తున్నారని నిఘాకు గురవుతున్న ఎమ్మెల్యేలు వాపోతున్నారు. విజయవాడ హోటల్‌లో జరిగిన సమావేశంలో…. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపైనా చర్చ జరిగింది. కేవలం తమ సామాజికవర్గానికి చెందిన నాయకులకు మాత్రమే తెలంగాణలో టీడీపీకి అండగా పనిచేసే అవకాశం ఇవ్వడంపైగా నిఘా ఎమ్మెల్యేలు చర్చించారు.

కొన్ని వర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం నమ్మడం లేదని ఎమ్మెల్యేలు ఒక నిర్ధారణకు వచ్చారు. కేబినెట్‌లోనూ కొందరు మంత్రులకు మినహా చాలా మంది మంత్రులకు స్వేచ్చ లేదని, వాళ్ళు చేయాల్సిన పనులను కూడా వాళ్ళిద్దరే చేసేస్తున్నారని…. వారంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని అభిప్రాయపడ్డారు. తమకు ఎదురవుతున్న అవమానాలపై మరోసారి సమావేశమై చర్చించాలని ఈ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.

First Published:  6 Dec 2018 8:00 AM IST
Next Story