Telugu Global
National

బీజేపీ పూణే లోక్‌సభ అభ్యర్థిగా మాధురీ దీక్షిత్..?

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతోంది. గత ఎన్నికల్లో మోడీ ప్రభావం బలంగా ఉన్న సమయంలో చాలా మంది బీజేపీ తరపున ఎన్నికల్లో నిలబడి ఎంపీలయ్యారు. అందుకే బీజేపీ సునాయాసంగా 268 సీట్లు గెలుచుకుంది. కాగా, 2019 ఎన్నికల్లో మోడీ అంతగా ప్రభావం చూపించలేరని…. అంతే కాకుండా కొంత మంది ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు బీజేపీ చేయించిన సర్వేల్లో తేలింది. దీంతో పలు స్థానాల్లో కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. […]

బీజేపీ పూణే లోక్‌సభ అభ్యర్థిగా మాధురీ దీక్షిత్..?
X

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతోంది. గత ఎన్నికల్లో మోడీ ప్రభావం బలంగా ఉన్న సమయంలో చాలా మంది బీజేపీ తరపున ఎన్నికల్లో నిలబడి ఎంపీలయ్యారు. అందుకే బీజేపీ సునాయాసంగా 268 సీట్లు గెలుచుకుంది.

కాగా, 2019 ఎన్నికల్లో మోడీ అంతగా ప్రభావం చూపించలేరని…. అంతే కాకుండా కొంత మంది ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు బీజేపీ చేయించిన సర్వేల్లో తేలింది. దీంతో పలు స్థానాల్లో కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని పూణే ప్రస్తుత బీజేపీ ఎంపీ అనిల్ షిరోలీని తప్పించాలని అధిష్టానం అనుకుంటోంది. కాంగ్రెస్‌కు పట్టున్న ఈ నియోజకవర్గాన్ని 2014లో అనిల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీ సాధించి బీజేపీ ఖాతాలో వేశాడు. కాని ఎంపీగా అంతగా ప్రభావం చూపించలేదు.

ఇప్పుడు ఈ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ని నిలబెట్టాలని అనుకుంటున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పూణే లోక్‌సభ స్థానానికి పరిశీలించడానికి రూపొందించిన లిస్ట్‌లో మాధురీ పేరు ఉందని ఆయన చెప్పారు. మరాఠీ అయిన మాధురీ స్వస్థలం పూణేనే. సినిమాల నుంచి ఎప్పుడో రిటైర్ అయినా టీవీ షోలలో అలరిస్తూ ప్రజలకు దగ్గరగానే ఉంది. కాబట్టి ఆమైతేనే పూణే స్థానానికి కరెక్ట్ అని అధిష్టానం అభిప్రాయం. మరి కొత్త వారితో బీజేపీ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.

First Published:  6 Dec 2018 12:20 PM IST
Next Story