టీడీపీ అభ్యర్థికి చెందిన రెండు కోట్లు పట్టివేత
ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు. కోట్లాది రూపాయలు రాత్రి వేళల్లో పంచిపెడుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు ఇంటి వద్ద రాత్రి డబ్బు సంచులు బయటపడడం కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు డబ్బు సంచులతో జూపూడి ఇంటి వెనుక నుంచి వెళ్తుండగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో ఇద్దరు డబ్బు సంచులతో పారిపోగా… ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. అతడి వద్ద దొరికిన డబ్బు సంచిలో 17లక్షలు […]
ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు. కోట్లాది రూపాయలు రాత్రి వేళల్లో పంచిపెడుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు ఇంటి వద్ద రాత్రి డబ్బు సంచులు బయటపడడం కలకలం రేపింది.
ముగ్గురు వ్యక్తులు డబ్బు సంచులతో జూపూడి ఇంటి వెనుక నుంచి వెళ్తుండగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో ఇద్దరు డబ్బు సంచులతో పారిపోగా… ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. అతడి వద్ద దొరికిన డబ్బు సంచిలో 17లక్షలు బయటపడ్డాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలో డబ్బు సరఫరా చేస్తున్న జూపూడిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
మరోవైపు వర్ధన్నపేట నుంచి మహాకూటమి తరపున పోటీ చేస్తున్న పగిడిపాటి దేవయ్యకు చెందిన రెండు కోట్ల రూపాయలు ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్‌కు చిక్కింది. కాజీపేట ఫాతిమ నగర్‌లోని గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో ఓటర్లకు పంపణి చేసేందుకు డబ్బును సిద్ధంగా ఉంచారన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు. దాడుల సమయంలో రెండు కోట్ల రూపాయలు దొరికింది. కూటమి తరపున పెద్దలు పంపిన డబ్బుగా దీన్ని భావిస్తున్నారు.