Telugu Global
NEWS

సౌరవ్ గంగూలీ సరసన చతేశ్వర్ పూజారా

టెస్ట్ తొలిరోజునే సెంచరీ సాధించిన భారత ఆరోక్రికెటర్ టెస్టుల్లో 5 వేల పరుగుల 12వ బ్యాట్స్ మన్ పూజారా ఆస్ట్రేలియా గడ్డపై తొలిశతకం సాధించిన నయావాల్ అడిలైడ్ టెస్ట్ తొలిరోజుఆటలోనే…టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా…పలు అరుదైన రికార్డులు సాధించాడు. కంగారూ గడ్డపైన…. తన టెస్ట్ కెరియర్ లో తొలి శతకం నమోదు చేశాడు. ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో భారతజట్టుకు సేవలు అందిస్తున్న నయా వాల్ చతేశ్వర్ పూజారా… ఆస్ట్రేలియాతో […]

సౌరవ్ గంగూలీ సరసన చతేశ్వర్ పూజారా
X
  • టెస్ట్ తొలిరోజునే సెంచరీ సాధించిన భారత ఆరోక్రికెటర్
  • టెస్టుల్లో 5 వేల పరుగుల 12వ బ్యాట్స్ మన్ పూజారా
  • ఆస్ట్రేలియా గడ్డపై తొలిశతకం సాధించిన నయావాల్

అడిలైడ్ టెస్ట్ తొలిరోజుఆటలోనే…టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా…పలు అరుదైన రికార్డులు సాధించాడు. కంగారూ గడ్డపైన…. తన టెస్ట్ కెరియర్ లో తొలి శతకం నమోదు చేశాడు.

ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో భారతజట్టుకు సేవలు అందిస్తున్న నయా వాల్ చతేశ్వర్ పూజారా… ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ …తొలిటెస్ట్ తొలిరోజుఆటలోనే సత్తా చాటుకొన్నాడు.

ఓపెనర్లు రాహుల్, మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఆరోనంబర్ వన్ ఆటగాడు రోహిత్ శర్మ, యువ హిట్టర్ రిషభ్ పంత్..ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అవుటైనా… పూజారా మాత్రం తన పోరాటం కొనసాగించి..ఫైటింగ్ సెంచరీతో టీమిండియా పరువు దక్కించాడు.

కంగారూ గడ్డపై తొలిశతకం…

తన కెరియర్ లో ఇంతకుముందువరకూ 64 టెస్టులు ఆడిన చతేశ్వర్ పూజారాకు… ఆస్ట్రేలియా గడ్డపైన కనీసం ఒక్కశతకంకూడా లేదు. అయితే… ఆ లోటును…ప్రస్తుత అడిలైడ్ టెస్ట్ ద్వారా

పూజారా పూడ్చుకొన్నాడు. మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 123 పరుగులు సాధించి రనౌట్ గా వెనుదిరిగాడు.

దాదా సరసన పూజారా….

పూజారా తన 16వ సెంచరీ పూర్తి చేయడం ద్వారా…మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు.గంగూలీకి సైతం టెస్ట్ క్రికెట్లో 16 సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

సౌరవ్ గంగూలీ 133 టెస్టుల్లో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధిస్తే…పూజారా మాత్రం 65 టెస్టుల్లోనే 16 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు నమోదు చేయటం విశేషం.

టెస్ట్ క్రికెట్లో 16 శతకాలు సాధించిన ఇతర ప్రముఖ క్రికెటర్లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ అథెర్టన్, గ్రాహం థోర్పే, శ్రీలంక మాజీ కెప్టెన్ మర్వన్ అటపట్టు, విండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్స్ సన్, తిలకరత్నే దిల్షాన్, హెర్బర్ట్ స్కట్ లిఫ్ ఉన్నారు.

తొలిరోజు ఆటలోనే….

టెస్ట్ మ్యాచ్ తొలిరోజుఆటలోనే శతకం పూర్తి చేసిన ప్రముఖ క్రికెటర్ల సరసన చతేశ్వర్ పూజారా సైతం చోటు సంపాదించాడు. ఈ ఘనత సాధించిన భారత ఆరో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

గతంలో ఇదే ఘనత సాధించిన భారత క్రికెటర్లలో విజయ్ మంజ్రేకర్, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, విరాట్ కొహ్లీ ఉన్నారు. టెస్ట్ తొలిరోజు ఆటలోనే సెంచరీలు రెండుసార్లు సాధించిన అరుదైన రికార్డు విరాట్ కొహ్లీకి మాత్రమే ఉంది.

ఇదే అత్యుత్తమ శతకం – పూజారా

తన టెస్ట్ కెరియర్ లో సాధించిన అత్యుత్తమ సెంచరీలలో ..అడిలైడ్ టెస్ట్ శతకం కూడా ఒకటని…తొలిరోజు ఆట ముగిసిన అనంతరం పూజారా చెప్పాడు. ఇంగ్లండ్ లో కౌంట్ క్రికెట్ ఆడటంతో… తన ఆటతీరులో పరిణతి వచ్చిందని…ఓర్పు నేర్పులతో బ్యాటింగ్ చేయగలుగుతున్నానని తెలిపాడు.

విదేశీ గడ్డపై…అదీ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా పై శతకం బాదడం సంతృప్తనిచ్చిందని పూజారా పొంగిపోతున్నాడు.

First Published:  6 Dec 2018 1:05 PM IST
Next Story