Telugu Global
NEWS

5 వేల పరుగుల క్లబ్ లో టీమిండియా నయావాల్

టెస్ట్ క్రికెట్లో 12వ భారత క్రికెటర్ చతేశ్వర్ పూజారా టెస్ట్ క్రికెట్లో 16వ శతకం సాధించిన నయా వాల్ 5వేల పరుగుల మైలురాయి చేరిన 12వ భారత క్రికెటర్ నయావాల్ చతేశ్వర్ పూజారా… అడిలైడ్ టెస్ట్ తొలిరోజు ఆటలో ఫైటింగ్ సెంచరీతో టీమిండియాను ఆదుకొన్నాడు. కంగారూ పేస్ కు ఓ వైపు టపటపా వికెట్లు రాలుతున్నా పూజారా మాత్రం…క్రీజునే అంటిపెట్టుకొని ఆడి..బాధ్యతాయుతమైన సెంచరీ సాధించాడు.  మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 6 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో…తన […]

5 వేల పరుగుల క్లబ్ లో టీమిండియా నయావాల్
X
  • టెస్ట్ క్రికెట్లో 12వ భారత క్రికెటర్ చతేశ్వర్ పూజారా
  • టెస్ట్ క్రికెట్లో 16వ శతకం సాధించిన నయా వాల్
  • 5వేల పరుగుల మైలురాయి చేరిన 12వ భారత క్రికెటర్

నయావాల్ చతేశ్వర్ పూజారా… అడిలైడ్ టెస్ట్ తొలిరోజు ఆటలో ఫైటింగ్ సెంచరీతో టీమిండియాను ఆదుకొన్నాడు.

కంగారూ పేస్ కు ఓ వైపు టపటపా వికెట్లు రాలుతున్నా పూజారా మాత్రం…క్రీజునే అంటిపెట్టుకొని ఆడి..బాధ్యతాయుతమైన సెంచరీ సాధించాడు.

మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 6 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో…తన 16వ టెస్ట్ శతకాన్ని పూర్తి చేశాడు.

ఈ క్రమంలో 5 వేల పరుగుల రికార్డును సైతం కైవసం చేసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5 వేల పరుగుల మైలు రాయి చేరిన భారత 12వ క్రికెటర్ గా నిలిచాడు. చివరకు 123 పరుగుల స్కోరుకు పూజారా రనౌట్ గా వెనుదిరిగాడు.

First Published:  6 Dec 2018 10:38 AM IST
Next Story