శివకుమార్‌పై వైసీపీ శాశ్వత బహిష్కరణ వేటు
వైసీపీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ కె. శివకుమార్‌పై ఆ పార్టీ వేటు వేసింది. శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, పోటీ చేయడం లేదని వైసీపీ ఇటీవల ప్రకటించింది. అయితే పార్టీ లెటర్ హెడ్‌ను ఉపయోగించి ఒక పార్టీకి వైసీపీ మద్దతు తెలుపుతున్నట్టుగా సందేహం ఇచ్చారు శివకుమార్. ఈ అంశాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇది వరకు కూడా పార్టీ నిర్ణయాలను ధిక్కరించేలా […]
వైసీపీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ కె. శివకుమార్‌పై ఆ పార్టీ వేటు వేసింది. శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, పోటీ చేయడం లేదని వైసీపీ ఇటీవల ప్రకటించింది. అయితే పార్టీ లెటర్ హెడ్‌ను ఉపయోగించి ఒక పార్టీకి వైసీపీ మద్దతు తెలుపుతున్నట్టుగా సందేహం ఇచ్చారు శివకుమార్. ఈ అంశాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
ఇది వరకు కూడా పార్టీ నిర్ణయాలను ధిక్కరించేలా వ్యవహరించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించింది. తెలంగాణలో వైసీపీ పోటీ చేయడం లేదని… ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని… వైసీపీ అభిమానులు వారి ఇష్టం ఆధారంగానే ఓటేయాలని వైసీపీ సూచించింది.
శివకుమార్ ప్రకటనను కొన్ని చానళ్లు ప్రసారం చేసిన నేపథ్యంలో గందరగోళానికి తావుండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వివరించింది.