Telugu Global
NEWS

జగన్‌ పై దాడి కేసులో కేంద్ర నిర్ణయానికి పదిరోజుల గడువు ఇచ్చిన హైకోర్టు

జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే కేసును ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించలేదని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్ ఇది వ్యక్తిగత దాడి కాబట్టి తామే విచారిస్తున్నామని చెప్పారు. ఏజీ వాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ తీరు ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడింది. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 14లోగా జగన్‌పై దాడి […]

జగన్‌ పై దాడి కేసులో  కేంద్ర నిర్ణయానికి పదిరోజుల గడువు ఇచ్చిన హైకోర్టు
X
జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే కేసును ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించలేదని ప్రశ్నించింది.
ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్ ఇది వ్యక్తిగత దాడి కాబట్టి తామే విచారిస్తున్నామని చెప్పారు. ఏజీ వాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ తీరు ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడింది.
అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 14లోగా జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. హైకోర్టు తీరును బట్టి జగన్‌పై హత్యాయత్నం కేసు తప్పనిసరిగా ఎన్‌ఐఏ చేతికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి విచారణను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.
ఎన్‌ఐఏకు కేసును అప్పగిస్తారో లేదో ఈనెల 14లోగా చెప్పాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించడం, ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.
అటు కేంద్రం స్పందించినా, లేదంటే కోర్టే నిర్ణయం తీసుకున్నా ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లే సూచనలే అధికంగా ఉన్నాయి.
First Published:  5 Dec 2018 9:19 AM IST
Next Story