Telugu Global
NEWS

గజ్వేల్‌.... పోతాడు సర్‌.... " లగడపాటి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోకవర్గం పైనా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన విషయాలు చెప్పారు. పరోక్షంగా అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని చెప్పే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌ వాట్సాప్ చాట్ లీక్‌ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన లగడపాటి అక్టోబర్ 28న తాను గజ్వేల్, సిద్దపేటలో పర్యటించి పరిశీలించానన్నారు. గజ్వేల్‌ సమీపంలో కొందరు పోలీసులు తన కారును నిలిపేశారన్నారు. ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏడుగురు కానిస్టేబుళ్లు తన కారును ఆపి తనిఖీ చేశారన్నారు. ఈ […]

గజ్వేల్‌....  పోతాడు సర్‌....   లగడపాటి  సంచలన వ్యాఖ్యలు
X

కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోకవర్గం పైనా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన విషయాలు చెప్పారు. పరోక్షంగా అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని చెప్పే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌ వాట్సాప్ చాట్ లీక్‌ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన లగడపాటి అక్టోబర్ 28న తాను గజ్వేల్, సిద్దపేటలో పర్యటించి పరిశీలించానన్నారు.

గజ్వేల్‌ సమీపంలో కొందరు పోలీసులు తన కారును నిలిపేశారన్నారు. ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏడుగురు కానిస్టేబుళ్లు తన కారును ఆపి తనిఖీ చేశారన్నారు. ఈ సందర్భంగా ఏడుగురు కానిస్టేబుళ్లు… గజ్వేల్‌లో పరిస్థితిని తనకు వివరించారన్నారు. ”పోతాడు…. సర్‌” అంటూ కానిస్టేబుళ్లు తనతో చెప్పారన్నారు.

అందుకు తాను అలాంటి అవకాశమే లేదని చెప్పగా…. తిరిగి కానిస్టేబుళ్లు డిసెంబర్ 11న మీరే చూస్తారు అంటూ చాలెంజ్‌ చేశారన్నారు. ఆ సమయంలో ఎస్‌ఐ ప్రసాద్‌ మాత్రం మౌనంగా ఉన్నారన్నారు. కావాలంటే ఆ ఎస్‌ఐ వెంట ఆరోజు ఉన్న కానిస్టేబుళ్ల పేర్లను కనుక్కోవచ్చన్నారు. ”ఓడిపోతాడు.. సర్‌” అంటూ చెప్పిన కానిస్టేబుళ్ల కళ్లలో తనకు కసి కనిపించిందన్నారు .

అయితే ”ఆ ఓడిపోయేది” ఎవరన్నది మాత్రం తాము చెప్పడం సరికాదని…. అందుకే ఆ పేరుచెప్పడం లేదన్నారు లగడపాటి. ఇలాంటి పరిస్థితులను గమనించి మార్పు చేసుకోవాలే గానీ… కొట్లాడితే, తిడితే సమస్య పరిష్కారం కాదని టీఆర్‌ఎస్‌కు లగడపాటి సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని… కేటీఆర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

First Published:  5 Dec 2018 7:06 AM IST
Next Story