Telugu Global
NEWS

కంగారూ కోటలో విరాట్ కొహ్లీ పాగా

ఆస్ట్రేలియా గడ్డపై 5 సెంచరీల విరాట్ కొహ్లీ కెప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా కొహ్లీ సత్తాకు పరీక్ష టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కాస్త…. విరాట్ కొహ్లీ తో కంగారూ లెవెన్ సమరంగా మారనుంది. టీమిండియా తురుపుముక్క విరాట్ కొహ్లీకి పగ్గాలు వేయటానికి… కంగారూ టీమ్ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో సమరానికి సిద్ధమయ్యింది. కంగారూలపై కళ్లు చెదిరే రికార్డు అడిలైడ్ ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల నాలుగు మ్యాచ్ ల టెస్ట్ […]

కంగారూ కోటలో విరాట్ కొహ్లీ పాగా
X
  • ఆస్ట్రేలియా గడ్డపై 5 సెంచరీల విరాట్ కొహ్లీ
  • కెప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా కొహ్లీ సత్తాకు పరీక్ష

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కాస్త…. విరాట్ కొహ్లీ తో కంగారూ లెవెన్ సమరంగా మారనుంది. టీమిండియా తురుపుముక్క విరాట్ కొహ్లీకి పగ్గాలు వేయటానికి… కంగారూ టీమ్ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో సమరానికి సిద్ధమయ్యింది.

కంగారూలపై కళ్లు చెదిరే రికార్డు

అడిలైడ్ ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్… టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ సత్తాకు అసలు సిసలు పరీక్ష కానుంది. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీకి కళ్లు చెదిరే రికార్డే ఉంది.

2014 ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కొహ్లీ…ఏకంగా 692 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏకంగా 86.50 సగటు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా…. విరాట్ కొహ్లీ ఆడిన ఎనిమిది టెస్టుల్లో 992 పరుగులతో…62.00 సగటు సాధించాడు. ఐదు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సైతం ఆస్ట్రేలియాపైన కొహ్లీకి సాధించిన రికార్డు ఉంది.

మాస్టర్ రికార్డుకు కొహ్లీ గురి….

ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ టీమ్ ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు అత్యధికంగా ఆరు శతకాలు బాదిన ఘనత ఉంది. ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లకు మారుపేరైన ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే ఉంది.

ఇక మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 11 టెస్టుల్లో 5 శతకాలు బాదితే…విరాట్ కొహ్లీ కేవలం 8 టెస్టుల్లోనే 5 సెంచరీలతో మాస్టర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

హైదరాబాదీ వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ..కంగారూ గడ్డపై నాలుగు సెంచరీలు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇద్దరూ ఇద్దరే…

ఇటు విరాట్ కొహ్లీ…అటు మాస్టర్ సచిన్….ఇద్దరూ 26 ఏళ్ల వయసుకే ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన మొనగాళ్లుగా నిలిచారు.

1999 డిసెంబర్ 28న మాస్టర్ సచిన్ 26 సంవత్సరాల వయసులో 5 శతకాలతో సహా వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు.

విరాట్ కొహ్లీ సైతం…2014 డిసెంబర్ 28న ఆస్ట్రేలియా పై ఐదోశతకంతో పాటు వెయ్యి పరుగులు సాధించడం విశేషం.

సచిన్ మొత్తం 20 టెస్టుల్లో 1809 పరుగులతో 53.20 సగటు సాధించాడు. విరాట్ కొహ్లీ ఆడిన 8 టెస్టుల్లోనే 992 పరుగులతో 62.00 సగటు నమోదు చేశాడు.

విరాట్ కొహ్లీకి భలే చాన్స్….

ఆస్ట్రేలియాతో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ద్వారా…మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న ఆరుశతకాల రికార్డును విరాట్ కొహ్లీ… అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతుంది.

ఈ సిరీస్ లోని నాలుగు టెస్టులు…. 8 ఇన్నింగ్స్ లో…. కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడితే…. కనీసం మూడు నుంచి నాలుగు శతకాలు సాధించే అవకాశం లేకపోలేదు.

73 టెస్టులు – 24 శతకాలు….

30 సంవత్సరాల విరాట్ కొహ్లీకి… ఇప్పటి వరకూ ఆడిన 73 టెస్టులు, 124 ఇన్నింగ్స్ లో 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో సహా… మొత్తం 6వేల 331 పరుగులు సాధించాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 51 టెస్ట్ సెంచరీల రికార్డుకు… కొహ్లీ 26 శతకాల దూరంలో నిలిచాడు. రానున్న కాలంలో సచిన్ పేరుతో ఉన్న సెంచరీలు, పరుగుల రికార్డులను విరాట్ కొహ్లీ అధిగమించినా ఆశ్చర్యం లేదు.

First Published:  5 Dec 2018 12:10 PM IST
Next Story