Telugu Global
National

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావొచ్చు " గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన ఆజాద్…. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావొచ్చన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నారని… రేపు ఆ స్థానంలో రేవంత్ రెడ్డి ఉండవచ్చన్నారు. సీఎం కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కేసీఆర్‌ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి […]

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావొచ్చు  గులాం నబీ ఆజాద్
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన ఆజాద్…. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావొచ్చన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నారని… రేపు ఆ స్థానంలో రేవంత్ రెడ్డి ఉండవచ్చన్నారు.

సీఎం కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కేసీఆర్‌ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలోకి రావొచ్చు అని ఆజాద్ వ్యాఖ్యానించిన సమయంలో రేవంత్ రెడ్డి అనుచరులు పెద్దెత్తున నినాదాలు చేశారు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి, భట్టి తదితరులు సీఎం కుర్చీ ఆశిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వస్తే దళిత కోటాలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతానని సర్వే సత్యనారాయణ కూడా చెప్పారు. ఈనేపథ్యంలో ఇటీవలే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని… ఆజాద్‌ సీఎం రేసులోకి తీసుకురావడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో కలిసి కీలక పాత్ర పోషించడంతో పాటు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డిని ఏ ప్రాతిపదికన సీఎం స్థాయి వ్యక్తిని చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. బహుశా చంద్రబాబు అండ రేవంత్ రెడ్డికి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

First Published:  5 Dec 2018 4:05 AM IST
Next Story