Telugu Global
NEWS

100కు పైగా గెలుస్తాం.... ఇది కేసీఆర్‌ సర్వే

దాచి దాచి తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కృష్ణా నదిలో నీళ్లు లేవు… గోదావరి నీటిని పంచుకుందామని రాహుల్‌ సమక్షంలోనే చంద్రబాబు కోదాడలో చెబుతున్నారని… కాంగ్రెస్ దద్దమ్మలు మాత్రం తలూపుతూ కూర్చున్నారని కేసీఆర్‌ ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్… తెలంగాణలో తన కీలు బొమ్మ ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ దెబ్బకొడితే కరకట్ట మీద పడ్డాడు కాబట్టి…. కేసీఆర్ స్థానంలో […]

100కు పైగా గెలుస్తాం.... ఇది కేసీఆర్‌ సర్వే
X

దాచి దాచి తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కృష్ణా నదిలో నీళ్లు లేవు… గోదావరి నీటిని పంచుకుందామని రాహుల్‌ సమక్షంలోనే చంద్రబాబు కోదాడలో చెబుతున్నారని… కాంగ్రెస్ దద్దమ్మలు మాత్రం తలూపుతూ కూర్చున్నారని కేసీఆర్‌ ఫైర్ అయ్యారు.

గజ్వేల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్… తెలంగాణలో తన కీలు బొమ్మ ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ దెబ్బకొడితే కరకట్ట మీద పడ్డాడు కాబట్టి…. కేసీఆర్ స్థానంలో దద్దమ్మలు ఉండే ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ప్రజలను హెచ్చరించారు.

అందుకోసం అక్రమ సంపాదనతో పాటు ఏపీ ఇంటెలిజెన్స్‌ను తెచ్చి తెలంగాణలో మోహరించారని విమర్శించారు. చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి మరీ భుజాలపై చంద్రబాబును ఎత్తుకొచ్చారన్నారు.

ఏకకాలంలో తెలంగాణపైకి రెండు కత్తులు దూస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను తొలుత తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు వీళ్లంతా నవ్వినవాళ్లేనన్నారు. టీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం ఇవ్వాలని అలా చేస్తే తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను బానిస కానివ్వబోనన్నారు. తెలంగాణ బానిస కాకుండా చేసే అవకాశం ఇప్పుడు ఓట్ల రూపంలో ప్రజల చేతిలోనే ఉందన్నారు.

తనను కొట్టడం చేతగాకే కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబును తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు వేల కోట్లతో రంగంలోకి దిగారన్నారు. డబ్బుతో తెలంగాణను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని…. తెలంగాణ కాకులు, గద్దల పాలు కాకుండా మేధావులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు ముందుకురావాలని కేసీఆర్ కోరారు.

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి చెబితే ఒక్క కాంగ్రెస్‌ నాయకుడైనా అదేలా అని మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి గోదావరి నీళ్లు తీసుకెళ్తామంటే ఒక్క కాంగ్రెస్‌ నేతైనా స్పందించారా అని నిలదీశారు.

దొంగ సర్వేలు చాలా వస్తాయని వాటిని చూసి ఆగం కావొద్దన్నారు. 100కు పైగా సీట్లను టీఆర్‌ఎస్‌ గెలవబోతుందని… అందులో అనుమానమే లేదని ఇది కేసీఆర్‌ సర్వే అని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.

First Published:  5 Dec 2018 12:00 PM IST
Next Story