రావణుడికి పది తలలు అయితే.... చంద్రబాబుకు పది నాలుకలు
చంద్రబాబు లాంటి అబద్ధాలకోరు, అవినీతి పరుడు, హిపోక్రాట్ ఈ ప్రపంచంలోనే ఉండడని, రావణుడికి పది తలలు అయితే…. చంద్రబాబుకు పది నాలుకలని…. అన్ని నాలుకలతోనూ అబద్దాలు చెబుతాడని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు చంద్రబాబు ఏవిధంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడో వివరించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు 12 వందల కోట్ల రూపాయలను చంద్రబాబు తరలించాడని, ఒక్కో నియోజకవర్గంలో 10 కోట్ల […]
చంద్రబాబు లాంటి అబద్ధాలకోరు, అవినీతి పరుడు, హిపోక్రాట్ ఈ ప్రపంచంలోనే ఉండడని, రావణుడికి పది తలలు అయితే…. చంద్రబాబుకు పది నాలుకలని…. అన్ని నాలుకలతోనూ అబద్దాలు చెబుతాడని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు.
ఈరోజు ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు చంద్రబాబు ఏవిధంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడో వివరించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు 12 వందల కోట్ల రూపాయలను చంద్రబాబు తరలించాడని, ఒక్కో నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏర్పాట్లు చేశాడని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చులకు ఆయనే డబ్బులను తరలిస్తున్నాడని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ప్రకటనల్లో చంద్రబాబు ఫొటో పెద్దగా వేస్తున్నారని…. దీనిని బట్టి తెలుగు దేశం, కాంగ్రెస్ డీల్ ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు కూడా బాబు రూ.500 కోట్ల చొప్పున పంపారని, 2019లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌కు 5,000 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్‌గా అందజేస్తానని రాహుల్‌కు ప్రామీస్ చేశాడని…. అందుకే రాహుల్‌తో అంత మమేకమై తిరుగుతున్నాడని విమర్శించారు.
నంద్యాల ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రజలకు ఒక విషయం చెప్పాడని వచ్చే ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 5వేలు ఇస్తామని ధీమాగా అన్నాడని…. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 15,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని చెప్పారు. ఇదంతా ప్రజల డబ్బు అని ఏపీలో దోచిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడని…. ఇంత డబ్బు ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నాడంటే రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నాడో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అవినీతిపరులైన నాయకులు కొందరు ప్రభుత్వ పనులలో, కాంట్రాక్టులలో ఒక శాతం కమీషన్ తీసుకునే వాళ్ళను చూశాం…. కానీ చంద్రబాబు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇవీ చాలక అనేక పనులను నామినేషన్ పద్దతిలో తన వాళ్ళకు అప్పగిస్తున్నాడు. ఇట్లా ఈ నాలుగన్నరేళ్ళలో నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుని దాచుకున్నాడు. ఈ డబ్బులో చాలా భాగాన్ని వచ్చే ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు.
ఈ దోచుకున్న డబ్బును ఎక్కడ దాచారో, ఎవరి దగ్గర దాచారో, ఎవరిద్వారా తరలిస్తున్నారో ఆ వివరాలన్నీ మాకు తెలుసునని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అన్నారు. అందరికీ తెలిసిన యరపతినేని, శ్రీనివాసే కాకుండా చాలామందికి తెలియని గోపీ లాంటి వాళ్ళే కాకుండా మరికొందరు కూడా ఈ అవినీతి సొమ్ము నిర్వహణ, పంపిణీలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని చెప్పారు.
2013లో అవినీతి పరులు కాంగ్రెస్ లో చేరుతారని బాబు అన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డిని కూడా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్‌లోకి పంపించాడు. దానిని బట్టే ఆయనను అర్థం చేసుకోవాలని, అవినీతిలో చంద్రబాబు హిమాలయాల అంచులకు వెళ్ళారని విమర్శించారు.
- Chandrababu Naiduchandrababu naidu commissionschandrababu naidu congress election fundingchandrababu naidu scamscongress election fundingelection fundinggovernment contractstdp contractorstelangana electionstelangana mahakutamitelangana mahakutami election fundingvijaya sai reddyvijaya sai reddy vizag press meet comments on chandrababu naidu telangana elections congress fundingYS JaganYSRCP