తెలంగాణ ఎన్నికలపై ఎన్డీటీవీ సర్వే....
దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒకవైపు… ప్రతిపక్షాలన్ని కూటమిగా మరోవైపు నిలబడ్డ వేళ ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఎన్డీటీవీ తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా ఈ సర్వేను పర్యవేక్షించి ఆ ఫలితాలను ప్రకటించారు. తెలంగాణ మొత్తం సర్వేచేసిన ఎన్డీటీవీ ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరిస్తోందని.. దక్షిణ తెలంగాణలో మాత్రం అనుకున్న స్థాయిలో సీట్లు […]
దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒకవైపు… ప్రతిపక్షాలన్ని కూటమిగా మరోవైపు నిలబడ్డ వేళ ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.
తాజాగా ఎన్డీటీవీ తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా ఈ సర్వేను పర్యవేక్షించి ఆ ఫలితాలను ప్రకటించారు.
తెలంగాణ మొత్తం సర్వేచేసిన ఎన్డీటీవీ ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరిస్తోందని.. దక్షిణ తెలంగాణలో మాత్రం అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టుకోదని తేల్చారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు సంతృప్తికరంగా ఉన్నారని…. పూర్తి కాని పథకాలు కూడా కేసీఆర్ చేస్తారని వారు నమ్ముతున్నట్టు తేలిందని పేర్కొన్నారు.
తెలంగాణలో పెన్షన్లు, ఉచిత 24 గంటల విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రైతుబంధు పథకాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని ఎన్డీటీవీ తెలిపింది. మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ, బీసీలకు రుణాలు పాక్షిక విజయం సాధించాయని తెలిపింది. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఫెయిల్ అయ్యాయని సర్వేలో తెలిపారు.
తెలంగాణలో అర్బన్ ఓటర్లు 39 శాతం, రూరల్ పాపులేషన్ 61శాతంగా ఉన్నారని ఎన్టీటీవీ తెలిపింది. ఇది దేశ సగటుకంటే తెలంగాణ అర్బన్ పాపులేషన్ ఎక్కువ అని తెలిపింది. అర్బన్ ఓటర్లు ఈసారి టీఆర్ఎస్ వైపు నిలబడ్డారని తేల్చారు.
ఇక తెలంగాణ ఎన్నికల్లో గడిచిన 30 ఏళ్లుగా ఆంధోల్ నియోజక వర్గంలో ఎవరైతే గెలుస్తారో…. ఆ పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎన్టీటీవీ కనిపెట్టింది. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంథని, బోధన్, నర్సాపూర్, వరంగల్ తూర్పు, జనగాం, సూర్యాపేట, షాద్ నగర్ లో గెలిచిన పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఎన్టీటీవీ పేర్కొంది.
ఓపినీయన్ పోల్స్ ఆధారంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు 66 సీట్లు, కాంగ్రెస్+టీడీపీ కూటమికి 39 సీట్లు, ఎంఐఎంకు 7, బీజేపీకి 4 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలుస్తారని ఎన్టీటీవీ తెలిపింది.
దీన్ని బట్టి టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ గెలుపునకు, కాంగ్రెస్ ఓటమికి కేవలం 2శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండబోతోందని తెలిపింది.