Telugu Global
NEWS

ల‌గ‌డ‌పాటి స‌ర్వే బండారం బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్ ! 

ఆంధ్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే బండారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌జా కూట‌మికే జ‌నం ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చంద్ర‌బాబు ఒత్తిడి మేర‌కే స‌ర్వే పేరుతో తెలంగాణ జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. ఈమేర‌కు ల‌గ‌డ‌పాటి గ‌త నెల 20న త‌న‌తో జ‌రిపిన చాట్‌ను బ‌య‌ట‌పెట్టారు. కేవలం చంద్రబాబు కుట్ర ను ప్రజలకు తెలియజేసేందుకే లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను […]

ల‌గ‌డ‌పాటి స‌ర్వే బండారం బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్ ! 
X

ఆంధ్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే బండారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌జా కూట‌మికే జ‌నం ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చంద్ర‌బాబు ఒత్తిడి మేర‌కే స‌ర్వే పేరుతో తెలంగాణ జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. ఈమేర‌కు ల‌గ‌డ‌పాటి గ‌త నెల 20న త‌న‌తో జ‌రిపిన చాట్‌ను బ‌య‌ట‌పెట్టారు. కేవలం చంద్రబాబు కుట్ర ను ప్రజలకు తెలియజేసేందుకే లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

గత నెల 20న టిఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయని కేటీఆర్‌తో చాట్‌లో ల‌గ‌డ‌పాటి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పెడుతున్న ఎఫర్ట్స్ బాగున్నాయని చెప్పారు. గ‌త రెండు వారాలుగా చాలా అంశాల‌ను తెర‌పైకి తీసుకొచ్చి పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చార‌ని కొనియాడారు.

టీఆర్ఎస్‌కు 65 నుంచి 70, కాంగ్రెస్ కూట‌మికి 35 నుంచి 40, బీజేపీకి 2 నుంచి 3 సీట్లు వస్తాయ‌ని, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు , ఇత‌రులు 1 నుంచి 2 సీట్లు గెలుస్తార‌ని ల‌గ‌డ‌పాటి ఆ మెసేజ్‌లో తెలిపారు. ఇదే విష‌యాన్ని తాను చంద్ర‌బాబుకి కూడా చెప్పిన‌ట్లు చెప్పుకొచ్చారు. ప్ర‌చారానికి ఇంకా 17 రోజుల టైమ్ ఉంది. టీఆర్ఎస్ ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ త‌న‌కు తెలుసున‌ని…. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల టైమ్‌లో చూశాన‌ని…. త‌న‌కు ఆశ్చ‌ర్యం వేయ‌డం లేద‌ని ల‌గ‌డ‌పాటి స‌మాధాన‌మిచ్చారు.

First Published:  4 Dec 2018 6:09 PM IST
Next Story