Telugu Global
NEWS

సోమి రెడ్డీ.... నువ్వు మంత్రివా? పీఆర్వోవా?

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక ఇద్దరు మాజీ చీఫ్‌ సెక్రెటరీలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే…. వాళ్ళ చెప్పిన విషయాల గురించి ఆలోచించకుండా…. వాళ్ళ మీద విరుచుకుపడే సోమిరెడ్డి మనిషేనా? అని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఐఏఎస్‌ అధికారులు పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నాడని…. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వ అవినీతిని మీడియాతో చెబుతాడా? అలాంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? అందుకు […]

సోమి రెడ్డీ....  నువ్వు మంత్రివా? పీఆర్వోవా?
X

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక ఇద్దరు మాజీ చీఫ్‌ సెక్రెటరీలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే…. వాళ్ళ చెప్పిన విషయాల గురించి ఆలోచించకుండా…. వాళ్ళ మీద విరుచుకుపడే సోమిరెడ్డి మనిషేనా? అని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఈ ఐఏఎస్‌ అధికారులు పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నాడని…. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వ అవినీతిని మీడియాతో చెబుతాడా? అలాంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? అందుకు సర్వీస్‌ రూల్స్‌ ఒప్పుకుంటాయా? ఇంత చిన్న విషయం తెలియని, ఇంగిత జ్ఞానం లేని సోమిరెడ్డి ఇన్నేళ్ళు ఆ మంత్రి పదవి ఎంత అజ్ఞానంతో నిర్వహించాడో, ప్రభుత్వ వ్యవస్థ గురించి ఎంత అవగాహన లేదో తెలుస్తోందన్నారు. తోలుబొమ్మలాటలో కేతిగాడిలాంటి సోమిరెడ్డి కూడా మాట్లాడడమేమిటో అర్థం కావడంలేదు అన్నారు.

ప్రశ్నించేది చంద్రబాబు అవినీతినైతే ఆయన సమాధానం చెప్పాలి కానీ…. ఆయన దగ్గర పెంపుడు జంతువు లాంటి సోమిరెడ్డి సమాధానం చెప్పడం ఏమిటని కాకాణి విమర్శించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నోరు మెదపకుండా…. సోమిరెడ్డి లాంటి వాళ్ళ చేత మొరిగించడం ఏమిటి? చంద్రబాబు నాయుడు మూతి నాకుతూ బ్రతికే సోమిరెడ్డికి అజయ్‌ కల్లామ్‌ నిజాయితీని ప్రశ్నించే అర్హత ఉందా?.

ఐవైఆర్ కృష్ణా రావు రాజధాని భూముల్లో అవినీతి గురించి మాట్లాడారు, అజయ్‌ కల్లామ్‌ వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని బయటపెట్టారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే ఏదో ఒక విచారణకు సిద్ధపడాలని…. సీబీఐ కాకుంటే న్యాయ విచారణకు లేదా సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ విచారణకు…. ఏదో ఒక దానికి సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.

చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ అవినీతి తారా స్థాయికి చేరింది కాబట్టే ఆయన సీబీఐ విచారణ అంటే భయపడుతున్నాడని…. సీబీఐ భ్రష్టు పట్టిందని అంటున్నాడని…. ఇదే చంద్రబాబు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు సీబీఐ ఎంక్వయిరీ అడిగాడని…. వైఎస్‌ తప్పుచేయలేదు కాబట్టే ఆయన కోరినట్టు సీబీఐ విచారణకు ఆదేశించాడని అన్నారు.

అదే చంద్రబాబు జగన్‌ మీద సీబీఐ ఎంక్వయిరీ జరిగినప్పుడు సీబీఐని ఆకాశానికి ఎత్తేశాడని….తెగ పొగిడాడని…. చట్టం తనపని తాను చేసుకుపోతోందని అన్నాడని….. మరి ఇప్పుడు సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకు అడ్డుపడుతున్నాడని…. విచారణ జరిగితే తను, తన కొడుకు జైలుకు పోవాల్సి వస్తుందని భయపడుతున్నాడని అందుకే సీబీఐ ఎంక్వయిరీ వద్దంటున్నాడని విమర్శించారు.

First Published:  4 Dec 2018 7:01 AM IST
Next Story