Telugu Global
Cinema & Entertainment

ఓన్లీ పంచ్ లు.... నో ఫైట్స్...!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు గా నటిస్తున్న సినిమా “ఎఫ్ 2”. అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి అని అంతా భావిస్తున్నారు. కానీ సినిమా మొత్తం ఒక్క ఫైట్ కూడా ఉండదట. కేవలం మాటలతో పంచ్ లు పడుతూనే ఉంటాయట. ఇక ఈ పంచ్ లు ఉండగా…. ఫైట్స్ ఎందుకు? అని భావించి ఒక్క ఫైట్ కూడా […]

ఓన్లీ పంచ్ లు.... నో ఫైట్స్...!
X

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు గా నటిస్తున్న సినిమా “ఎఫ్ 2”. అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి అని అంతా భావిస్తున్నారు. కానీ సినిమా మొత్తం ఒక్క ఫైట్ కూడా ఉండదట. కేవలం మాటలతో పంచ్ లు పడుతూనే ఉంటాయట.

ఇక ఈ పంచ్ లు ఉండగా…. ఫైట్స్ ఎందుకు? అని భావించి ఒక్క ఫైట్ కూడా పెట్టలేదట అనిల్ రావిపూడి. ఇటీవలే ఈ సినిమా రషస్ చూసిన నిర్మాత దిల్ రాజు సన్నిహితులు కొందరు ఈ సినిమా మంచిగా వచ్చిందని, సంక్రాంతికి సరైన సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. “మల్లీశ్వరి” తరువాత వెంకటేష్ ఇంతలా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చెయ్యడం ఇదే అని వారు అంటున్నారట.

ఇక ఇప్పటివరకు డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్ తొలి సారి ఒక పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లో నటించాడు. వీరిద్దరి సరసన తమన్న, మేహ్రిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

First Published:  4 Dec 2018 4:38 AM IST
Next Story