Telugu Global
NEWS

టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల: ప్రస్తుత పథకాలు కొనసాగిస్తూనే ఇవీ!

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం టీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో విడుదల చేశారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. హైదరాబాద్ ను గత పాలకులు కమర్షియల్ దృష్టితో చూశారన్నారు. ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా చూడలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారన్నారు. […]

టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల: ప్రస్తుత పథకాలు కొనసాగిస్తూనే ఇవీ!
X

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం టీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో విడుదల చేశారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. హైదరాబాద్ ను గత పాలకులు కమర్షియల్ దృష్టితో చూశారన్నారు. ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా చూడలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారన్నారు. కోటి జనాభా ఉంటే అధికారిక మార్కెట్లు ఏడు మాత్రమే ఉన్నాయన్న కేసీఆర్…. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా మార్చేందుకు కుట్రలు చేశారని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్నో అవరోధాలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సంక్షేమంలో టీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని… వ్యవసాయ రంగం కుదుటపడిందని చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోందన్న కేసీఆర్…. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజమవుతోందని, విద్యా విధానంలో ఎన్నో మార్పులు చేశామన్నారు. ఆరోగ్య తెలంగాణగా మార్చుతున్నామని, ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, కొత్త జిల్లాలు… డివిజన్లు…. ఇలా ఎన్నో అద్భుత సంస్కరణలు చేపట్టామని, పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

అంతేకాదు లా అండ్ ఆర్డర్ బాగుందని చెప్పారు. షీ టీమ్ లు ఎంత బాగా పనిచేస్తున్నాయో మీకు తెలుసన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన ఎన్నో పథకాలకు ఐక్యరాజ్య సమితి మొదలు నీతి ఆయోగ్ వరకు ప్రశంసలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 లో మేనిఫెస్టోలో చేర్చని అంశాలు కూడా అమలు చేశామన్నారు.

ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్న కేసీఆర్… సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతున్నామన్నారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను అన్నింటిని కొనసాగిస్తామని, చెబుతూ తాజా మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపర్చారు.

1. ఆసరా పింఛన్ రూ.1000 నుంచి రూ.2016

2. వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016

3. బీడీ కార్మికులకు కటాఫ్ డేట్‌ను 2018 వరకు పొడిగింపు

4. వృద్ధాప్య పించన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు

5. నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగభృతి

6. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను కొనసాగింపు

7. సొంత ఇళ్ళ నిర్మాణానికి అర్హులకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు చెల్లింపు

8. రైతు బంధుకు ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10వేలు.

9. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

10. ఎస్టీలకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల చొప్పున కేంద్రంతో పోరాటం.

11. ఏస్సీ వర్గీకరణపై కేంద్రం ఆమోదం కోసం పోరాటం. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి పథకాలు

12. కంటి వెలుగు తరహా ఇంట్లోని వారందరికీ ఇతర ఆరోగ్య పరీక్షలకోసం వైద్య శిబిరాలు ఏర్పాటు.

13. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డ్. ప్రభుత్వ ఉద్యోగులకు సముచితరీతిలో వేతన సవరణ.

14. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి చర్యలు.

15. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం కోసం మరింత ముమ్మర ప్రయత్నాలు.

First Published:  3 Dec 2018 3:00 AM IST
Next Story