పోలింగ్ స్టేషన్లలో బ్రీత్ ఎనలైజర్లు...?
హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద వీకెండ్స్‌లో పోలీసులు మద్యం మత్తులో ఉండే వారిని పట్టుకోవడానికి బ్రీత్ ఎనలైజర్లు ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని పట్టుకొని శిక్షలు విధించడం నిరంతరం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా బ్రీత్ ఎనలైజర్లు వాడే యోచనలో ఎన్నికల సంఘం ఉంది. మద్యం సేవించి ఓటు వేయడం నేరం కాకపోయినా… తాగి వచ్చే వారి వల్ల ఇతర ఓటర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. […]
హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద వీకెండ్స్‌లో పోలీసులు మద్యం మత్తులో ఉండే వారిని పట్టుకోవడానికి బ్రీత్ ఎనలైజర్లు ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని పట్టుకొని శిక్షలు విధించడం నిరంతరం జరుగుతూనే ఉంది.
అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా బ్రీత్ ఎనలైజర్లు వాడే యోచనలో ఎన్నికల సంఘం ఉంది. మద్యం సేవించి ఓటు వేయడం నేరం కాకపోయినా… తాగి వచ్చే వారి వల్ల ఇతర ఓటర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మద్యం సేవించి వచ్చే వాళ్లు పోలింగ్ బూత్‌లలో ఆటకం కలిగించడం లేదా వివాదాలు సృష్టించడం జరుతూనే ఉంటుంది.
అలాంటి వారిని అసలు పోలింగ్ స్టేషన్లలోకే అనుమతించకుండా నిరోధించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వందల సంఖ్యలో వినతులు వచ్చాయి. ఎన్నికల రోజు కూడా ఓటర్లను అభ్యర్థులు మద్యంతో మభ్యపెడుతున్నారని…. వీరిని ఓటు వేయకుండా ఆపాలని కొన్ని వినతులు వచ్చాయి.
ఈ వినతులపై సీఈవో రజత్ కుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మద్యం మత్తు, డ్రగ్స్ సేవించి ఓటు వేయడానికి వచ్చిన వారు ఇబ్బందులు పెడితే అక్కడి ప్రిసైడింగ్ అధికారి తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం వీలు కల్పిస్తూ అధికారాలు ఇచ్చింది. మరోవైపు బ్రీత్ ఎనలైజర్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రజత్ కుమార్…. డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. డీజీపీ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి బ్రీత్ ఎనలైజర్ల ఏర్పాటు ఉండబోతోంది.