Telugu Global
NEWS

ఆరు ఓట్లు ఉంటే ఏసీ ‌- హైదరాబాద్‌లో ఓటర్లపై ఖరీదైన వల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం మొదలైంది. నగదు, ఖరీదైవ వస్తువులతో ఓటర్లకు వల వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు మరింత కాస్ట్‌లీగా మారాయి. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకం కావడంతో ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు ఖరీదైన వస్తువులు ఆఫర్ చేస్తున్నారు. కొన్నిచోట్ల కూపన్లు పంచుతున్నారు. వాటిని తీసుకెళ్లి షాప్‌లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడమే. ఇంట్లో ఐదు కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఫ్రిజ్‌లు, […]

ఆరు ఓట్లు ఉంటే ఏసీ ‌- హైదరాబాద్‌లో ఓటర్లపై ఖరీదైన వల
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం మొదలైంది. నగదు, ఖరీదైవ వస్తువులతో ఓటర్లకు వల వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు మరింత కాస్ట్‌లీగా మారాయి. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకం కావడంతో ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు.

హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు ఖరీదైన వస్తువులు ఆఫర్ చేస్తున్నారు. కొన్నిచోట్ల కూపన్లు పంచుతున్నారు. వాటిని తీసుకెళ్లి షాప్‌లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడమే. ఇంట్లో ఐదు కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఫ్రిజ్‌లు, ఏసీలను ఆఫర్ చేస్తున్నారు. కావాలంటే నగదు ఇచ్చేందుకు సై అంటున్నారు.

ఖరీదైన పెద్ద టీవీలను ఇచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. పది మంది ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి ఉన్న గల్లీ నేతలకు 40 వేల నుంచి 50వేల విలువైన సెల్‌ఫోన్లను అభ్యర్థులు పంచుతున్నారు. వందల సంఖ్యలో ఓట్లను ఆకర్షించే స్థామర్థ్యం ఉన్న వారికి 10 లక్షల వరకు ఇస్తున్నారు.

సదరు ఓటర్లకు పంచేందుకు మరికొంత సొమ్మును కూడా చోటా లీడర్ల చేతిలో పెడుతున్నారు. నేరుగా డబ్బు పంచడం కంటే కూపన్ల సిస్టం పట్లే అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.

First Published:  3 Dec 2018 6:40 AM IST
Next Story