మీకు పౌరుషం లేదా? తిరగబడండి " సీమ యువతకు పవన్ పిలుపు
జనసేన అధికారంలోకి వస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకుంటూ వస్తారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన జనసేన కవాతులో ప్రసంగించిన ఆయన… తాను రాయలసీమలో పుట్టకపోయినా రాయలసీమ రాగిముద్ద, జొన్న సంగటి తిన్నవాడినేనన్నారు. తాను తిరిమెల నాగిరెడ్డికి ఏకలవ్య శిష్యుడినని చెప్పారు. కరువు సీమను ఇజ్రాయెల్ తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తాను పరిటాల సునీత ఇంటికి వెళ్లడాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. తాను […]
జనసేన అధికారంలోకి వస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకుంటూ వస్తారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన జనసేన కవాతులో ప్రసంగించిన ఆయన… తాను రాయలసీమలో పుట్టకపోయినా రాయలసీమ రాగిముద్ద, జొన్న సంగటి తిన్నవాడినేనన్నారు. తాను తిరిమెల నాగిరెడ్డికి ఏకలవ్య శిష్యుడినని చెప్పారు. కరువు సీమను ఇజ్రాయెల్ తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తాను పరిటాల సునీత ఇంటికి వెళ్లడాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. తాను పరిటాల సునీత ఇంటికి వెళ్లానంటే వారికి భయపడి కాదని… అది తన సంస్కారం అని చెప్పారు. జేసీ దివాకర్ రెడ్డిని గౌరవించడం కూడా తన సంస్కారమేనని… కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి దాష్టీకాన్ని మాత్రం అంగీకరించబోనన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో తనను భయపెట్టలేరన్నారు.
ఎందరో మహానుభావులను గుండెల్లో పెట్టుకున్న రాయలసీమను అడ్డంగా నరుక్కునే ఫ్యాక్షన్ గడ్డగా సినిమాల్లో చిత్రీకరిస్తున్నారని పవన్ అభ్యంతరం తెలిపారు. ఇలా చేయడాన్ని యువత అడ్డుకోవాలన్నారు. ఊరికి పది మంది యువకులు తిరగబడి సీమను కించపరిచేవారిని అడ్డుకోవాలన్నారు. మీకు ధైర్యం లేదా, పౌరుషం లేదా? అని పవన్ ప్రశ్నించారు.
తనను వయసులో పెద్దవాళ్లు నమ్మరని… మహిళలు, యువతే అండగా నిలుస్తున్నారన్నారు. రాయలసీమ గడ్డ జనసేనకు అడ్డాగా మారాలన్నారు పవన్.