Telugu Global
NEWS

పాలమూరు పథకం పై నాగం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని సక్రమంగానే ఉన్నాయని హై కోర్టు పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి పథకంలో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాక్రిష్ణన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం నాగం పిటిషన్ ను రద్దు చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం […]

పాలమూరు పథకం పై నాగం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
X

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని సక్రమంగానే ఉన్నాయని హై కోర్టు పేర్కొంది.

పాలమూరు-రంగారెడ్డి పథకంలో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాక్రిష్ణన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం నాగం పిటిషన్ ను రద్దు చేసింది.

మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే అతిపెద్ద ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు. శ్రీశైలం డ్యాం నుంచి క్రిష్ణా నదీ జలాలను ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి గతంలో హై కోర్ట్ లో పిల్‌ వేశారు.

దీనిని విచారించిన కోర్ట్ నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పథకంలో ఎలాంటి అవినీతి జరిగినట్టు ఆధారాలు లభించలేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొంటూ నాగం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

First Published:  3 Dec 2018 6:50 AM IST
Next Story