Telugu Global
NEWS

టీడీపీలో రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది " టీడీపీ ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురజాల నియోజవకర్గం దాచేపల్లిలో జరిగిన రెడ్డి సామాజికవర్గం వనభోజనాలకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి… టీడీపీలో తమ పరిస్థితిని వివరించి ఆవేదన చెందారు. టీడీపీలో రెడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురజాలలో మనోడినే ( వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌) గెలిపించుకోండి అని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి… […]

టీడీపీలో రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది  టీడీపీ ఎమ్మెల్యే
X

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురజాల నియోజవకర్గం దాచేపల్లిలో జరిగిన రెడ్డి సామాజికవర్గం వనభోజనాలకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి… టీడీపీలో తమ పరిస్థితిని వివరించి ఆవేదన చెందారు. టీడీపీలో రెడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గురజాలలో మనోడినే ( వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌) గెలిపించుకోండి అని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి… రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదని… ఆయన పేదల కోసం, పేదల సంక్షేమం కోసం నిలబడ్డారని మోదుగులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ లాంటి కార్యక్రమాలు ఆయన చలవేనన్నారు. వైఎస్ పేదలకు, వెనుబడిన వర్గాల కోసం పనిచేశారు కాబట్టే ఆయన చనిపోయినప్పుడు పేద ప్రజలు తమ సొంత మనిషి పోయినంతగా బాధపడ్డారని వ్యాఖ్యానించారు.

పేదల కోసం తపించిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అన్నారు. తిరిగి అలాంటి రాజ్యమే రావాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటున్నానని మోదుగుల వ్యాఖ్యానించారు. రెడ్డి కులం వారు వారి కోసమే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలకు అండగా ఉండాలని సూచించారు.

తెలుగుదేశంలో తన పరిస్థితి కూడా ఘోరంగా ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా రాయపాటి ఉన్నారు. మోదుగుల చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ఆయన నేరుగా వైఎస్‌లాంటి పాలన రావాలని కోరుకోవడంతో టీడీపీలో చర్చ మొదలైంది.

First Published:  3 Dec 2018 5:13 AM IST
Next Story