Telugu Global
NEWS

ఆ ముగ్గురు కీలక నేతలు ఓడిపోతున్నారు " చిట్‌చాట్‌లో కేటీఆర్‌

మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్‌…. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 17 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని కేటీఆర్‌ చెప్పారు. నందమూరి సుహాసిని కూడా ఓడిపోతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ కీలక నేతలైన జానారెడ్డి నాగార్జునసాగర్‌లో, రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, భట్టి విక్రమార్క మధిరలో ఓడిపోతున్నట్టు కేటీఆర్‌ జోస్యం చెప్పారు. చంద్రబాబు విలువలు […]

ఆ ముగ్గురు కీలక నేతలు ఓడిపోతున్నారు  చిట్‌చాట్‌లో కేటీఆర్‌
X

మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్‌…. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 17 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని కేటీఆర్‌ చెప్పారు. నందమూరి సుహాసిని కూడా ఓడిపోతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ కీలక నేతలైన జానారెడ్డి నాగార్జునసాగర్‌లో, రేవంత్ రెడ్డి కొడంగల్‌లో, భట్టి విక్రమార్క మధిరలో ఓడిపోతున్నట్టు కేటీఆర్‌ జోస్యం చెప్పారు.

చంద్రబాబు విలువలు లేని వ్యక్తిగా మారి కేవలం అధికారమే పరమావధిగా బతుకుతున్నారని… చంద్రబాబు తెలంగాణలో చేస్తున్న ప్రయత్నాలు నిష్పలమేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్న అమరావతి గ్రాఫిక్స్‌ ఇటీవల విడుదలైన 2.0 చిత్రం, బాహుబలి కంటే అద్భుతంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంటర్‌నెట్‌ను తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు… భవిష్యత్తులో చందమామకు కూడా తన పేరే పెట్టుకున్నారని చెబుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మహాకూటమి ఒక మాయకూటమి అని టీజేఎస్‌కు చెందిన రచనారెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డిలే ఇప్పుడు స్వయంగా చెబుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కేవలం రెండుస్థానాలకు పరిమితమైన పార్టీగా అభివర్ణించారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నారని…. అందుకే కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఎలాగైనా కొడంగల్‌లో ఎన్నికలు వాయిదా వేయించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని…. అవేవీ ఫలించవన్నారు. సిరిసిల్ల నుంచి తాను 50వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

First Published:  3 Dec 2018 3:23 AM IST
Next Story