జగన్‌పై దాడి కేసు... ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విషయంలో ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించ లేదని ప్రశ్నించింది. అసలు ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే… కేంద్రానికి తెలపకుండా కేసును ఏపీ పోలీసులు ఎలా విచారిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దాడి ఎయిర్‌పోర్టు లోపల జరిగినందున కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. అలా కేసును కేంద్ర సంస్థలకు ఎందుకు అప్పగించలేదో చెప్పాలని ఏపీ పోలీసులను ఆదేశించింది. కేసును ఎందుకు ఎన్‌ఐఏకు అప్పగించ […]
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విషయంలో ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించ లేదని ప్రశ్నించింది. అసలు ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే… కేంద్రానికి తెలపకుండా కేసును ఏపీ పోలీసులు ఎలా విచారిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
దాడి ఎయిర్‌పోర్టు లోపల జరిగినందున కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. అలా కేసును కేంద్ర సంస్థలకు ఎందుకు అప్పగించలేదో చెప్పాలని ఏపీ పోలీసులను ఆదేశించింది.
కేసును ఎందుకు ఎన్‌ఐఏకు అప్పగించ లేదో సమాధానం చెబుతూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
హైకోర్టు నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడ్డట్టుగానే భావిస్తున్నారు. ఈ కేసు తప్పనిసరిగా మరో దర్యాప్తు సంస్థకు బదిలీ అవడం ఖాయమని అనుకుంటున్నారు.