Telugu Global
National

ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్ ఓవైసీ

తన ఆరోగ్యం అసలు బాగోలేదని…ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలు కావొచ్చని…ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్చరుద్దీన్ ఓవైసీ అన్నారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సభలో మాట్లాడుతూ…గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. తన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని…కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయన్నారు. కొన్ని రోజుల కిందటే పరిస్థితి […]

ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్ ఓవైసీ
X

తన ఆరోగ్యం అసలు బాగోలేదని…ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలు కావొచ్చని…ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్చరుద్దీన్ ఓవైసీ అన్నారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సభలో మాట్లాడుతూ…గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. తన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని…కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయన్నారు. కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటిపోయిందని…వైద్యులు తనను డయాలసిస్ చేసుకోమని సూచించారని అక్బరుద్దీన్ చెప్పారు.

తన ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదన్నారు. అనారోగ్యం కారణంగానే ఇప్పటికే కొన్ని ఎన్నికల సభల్లో అక్బర్ పాల్గొనలేదు. తానెప్పుడూ తన కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని…తన కమ్యూనిటీకి సేవ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నా… వాళ్ల కోసం తన స్థానాన్ని ఖాళీ చేస్తానని అక్బర్ స్పష్టం చేశారు.

First Published:  3 Dec 2018 3:13 AM IST
Next Story