Telugu Global
Cinema & Entertainment

మరోసారి మెడికల్ స్టూడెంట్ పాత్రలో....

మెడికల్ కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ అనగానే ఎవరికైనా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పాత్ర గుర్తొస్తుంది. ఆ పాత్రకు అంతలా జీవం పోశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్ చేయడానికి ఏ హీరో సాహసం చేయడు. ఆడియన్స్ పై అంత ప్రభావం చూపించింది ఆ పాత్ర. ఇప్పుడు ఇదే పాత్రలో మరోసారి కనువిందు చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అవును.. తన అప్ కమింగ్ మూవీ డియర్ కామ్రేడ్ లో […]

మరోసారి మెడికల్ స్టూడెంట్ పాత్రలో....
X

మెడికల్ కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ అనగానే ఎవరికైనా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పాత్ర గుర్తొస్తుంది. ఆ పాత్రకు అంతలా జీవం పోశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్ చేయడానికి ఏ హీరో సాహసం చేయడు. ఆడియన్స్ పై అంత ప్రభావం చూపించింది ఆ పాత్ర.

ఇప్పుడు ఇదే పాత్రలో మరోసారి కనువిందు చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అవును.. తన అప్ కమింగ్ మూవీ డియర్ కామ్రేడ్ లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు కాకినాడ మెడికల్ కాలేజ్ లో విజయ్ దేవరకొండపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఆమె మహిళా క్రికెటర్ గా కనిపించబోతోంది. ఇదే కాలేజ్ గ్రౌండ్స్ లో రష్మికపై కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, చాలా ఎమోషన్స్ ఉంటాయంటున్నాడు దర్శకుడు క్రాంతి మాధవ్.

First Published:  1 Dec 2018 8:01 PM
Next Story