కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం చాలా హాట్ హాట్ గా సాగుతూ ఉంది. ప్రచార పర్వంలో మరో మూడునాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా అటు నేతలు ఇటు, ఇటు నేతలు అటూ జంపింగులు చేస్తుండటం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దశలోనే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు అటూ ఇటూ మారిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ నుంచి […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం చాలా హాట్ హాట్ గా సాగుతూ ఉంది. ప్రచార పర్వంలో మరో మూడునాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా అటు నేతలు ఇటు, ఇటు నేతలు అటూ జంపింగులు చేస్తుండటం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దశలోనే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు అటూ ఇటూ మారిన సంగతి తెలిసిందే.
అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ నుంచి కొంతమందిని ఇటు తీసుకొచ్చింది. ఇక టీఆర్ఎస్ కూడా వీలైనంతమంది కాంగ్రెస్ నేతలను తమ వైపుకు తెచ్చుకుంది. ఇదీ కథ.
ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఝలక్ ఇచ్చేలా వ్యవహరించింది టీఆర్ఎస్. కోమటిరెడ్డి ముఖ్య అనుచరులను తెలంగాణ రాష్ట్ర సమితి తమ వైపుకు తిప్పుకుంది. కోమటిరెడ్డికి అత్యంత ఆప్త నేతలనే తెరాస తమ వైపుకు తెచ్చుకుంది. ఆ పరిణామం కోమటిరెడ్డికి కూడా బాగానే దెబ్బ కొట్టినట్టుగా ఉంది. అందుకే ఆయన ఇప్పుడు రీవేంజ్ తీర్చుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి నల్లగొండ నియోజకవర్గం ఇన్ చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిని కోమటిరెడ్డి తన వాడిని చేసుకున్నాడు. నర్సింహారెడ్డితో కోమటిరెడ్డి చర్చలు జరిపి రాజీనామా చేయించారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ కూడా పాల్గొన్నాడు.
వెంకట్ రెడ్డి, నర్సింహారెడ్డిలకు రాజకీయంగా వైరం ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చలామణి అయ్యారు. అయితే కేసీఆర్ కు గట్టి ఝలక్ ఇవ్వాలనే లెక్కతో వెంకట్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి నర్సింహారెడ్డి తో చర్చలు జరిపి.. తన వైపు తిప్పుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నియోజకవర్గంలో ర్యాలీ కూడా చేశారు.