Telugu Global
NEWS

కోదండరాంకు షాక్.... రచనా రెడ్డి రిజైన్‌, కేటీఆర్‌ స్పందన

టీజేఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ-కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టిన టీజేఎస్ అధినేత కోదండరాంకు సొంతపార్టీ నేతలే షాక్‌ ఇస్తున్నారు. టీజేఎస్‌, మహాకూటమి తీరు సరిగా లేదంటూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి టీజేఎస్‌కు రాజీనామా చేశారు. మహాకూటమిని ఆమె ఒక విషకూటమిగా అభివర్ణించారు. మీడియాతో మాట్లాడిన ఆమె… కోదండరాం మహాకూటమితో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.  కోదండరాం తీరును చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు […]

కోదండరాంకు షాక్.... రచనా రెడ్డి రిజైన్‌, కేటీఆర్‌ స్పందన
X

టీజేఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ-కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టిన టీజేఎస్ అధినేత కోదండరాంకు సొంతపార్టీ నేతలే షాక్‌ ఇస్తున్నారు.

టీజేఎస్‌, మహాకూటమి తీరు సరిగా లేదంటూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి టీజేఎస్‌కు రాజీనామా చేశారు. మహాకూటమిని ఆమె ఒక విషకూటమిగా అభివర్ణించారు.

మీడియాతో మాట్లాడిన ఆమె… కోదండరాం మహాకూటమితో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కోదండరాం తీరును చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు.

మహాకూటమిలో బ్రోకర్లు తయారయ్యారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉంటే చంద్రబాబును తెలంగాణలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారామె.

రచనారెడ్డితో పాటు మరోనేత ఆదిత్య మర్రి కూడా టీజేఎస్‌కు రాజీనామా చేశారు. వీరి రాజీనామాను మాజీ మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. రచనారెడ్డి చివరిలోనైనా రియలైజ్ అయ్యారని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ప్రముఖ న్యాయవాది అయిన రచనా రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడేవారు. టీవీ చర్చల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా చాలా దూకుడుగా మాట్లాడేవారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కేసులు కూడా వాదిస్తున్నారు.

First Published:  2 Dec 2018 2:00 AM GMT
Next Story