Telugu Global
NEWS

వైఎస్ బొమ్మతో ఓట్లడుగుతున్న నందమూరి బాలకృష్ణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మహాకూటమి అభ్యర్థులు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పని చేస్తున్నాయి. దశాబ్దాల వైరం విడిచి కాంగ్రెస్‌ వాళ్లు టీడీపీ జెండా మోస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ జెండాను నెత్తికెత్తుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్టీఆర్‌, చంద్రబాబు బొమ్మలతో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వైఎస్ బొమ్మతో ప్రచారం చేస్తున్నారు. చిన్నచిన్న నాయకులు, గెలిస్తే చాలనుకునే అభ్యర్థులే కాదు… టీడీపీలో ఓస్థాయి ఉన్న వారు కూడా వైఎస్‌ బొమ్మను, కాంగ్రెస్ […]

వైఎస్ బొమ్మతో ఓట్లడుగుతున్న నందమూరి బాలకృష్ణ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మహాకూటమి అభ్యర్థులు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పని చేస్తున్నాయి.

దశాబ్దాల వైరం విడిచి కాంగ్రెస్‌ వాళ్లు టీడీపీ జెండా మోస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ జెండాను నెత్తికెత్తుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్టీఆర్‌, చంద్రబాబు బొమ్మలతో ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ వాళ్లు వైఎస్ బొమ్మతో ప్రచారం చేస్తున్నారు. చిన్నచిన్న నాయకులు, గెలిస్తే చాలనుకునే అభ్యర్థులే కాదు… టీడీపీలో ఓస్థాయి ఉన్న వారు కూడా వైఎస్‌ బొమ్మను, కాంగ్రెస్ జెండాను పెట్టుకుని ఓట్లడుతున్నారు. ఆ జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా చేరారు.

కూకట్‌పల్లిలో ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ .. తన అన్న కుమార్తె సుహాసినిని గెలపించాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… ఏపీలో వైఎస్ కుటుంబంపై రోజూ విమర్శలు, ఆరోపణలు చేసే టీడీపీ నేతలు వైఎస్ బొమ్మను వాడుకుని ఓట్లడుగుతున్నారు.

బాలకృష్ణ కూడా తన ప్రచార రథానికి ఒకవైపు టీడీపీ జెండా, మరోవైపు కాంగ్రెస్‌ జెండాను పెట్టుకోవడంతో పాటు తన ప్రచార రథంపై వైఎస్ బొమ్మను కూడా అతికించుకుని తిరుగుతున్నారు. వైఎస్‌ బొమ్మతో ప్రచారం చేస్తూ టీడీపీకి ఓటేయాల్సిందిగా కోరుతున్నారు.

కాంగ్రెస్‌ జెండాతో నందమూరి కుటుంబం ప్రచారం చేయడమే వైపరిత్యం అనుకుంటే… చివరకు వైఎస్‌ బొమ్మను పెట్టుకుని బాలకృష్ణ ఓట్లడగడం చూసి జనానికి దిమ్మతిరుగుతోంది. ఇలా నైతికత లేని రాజకీయాలతో సభ్యసమాజానికి ఏం మేసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆశ్చర్యపోతున్నారు.

First Published:  2 Dec 2018 4:54 AM IST
Next Story