Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే?

మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసిన కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ టైటిల్ ఇదే) ఇప్పుడు పాటల మీద పడ్డాడు. ఇందులో భాగంగా ఈరోజు బయోపిక్ పార్ట్-1 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. “ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా” అనే సాహిత్యంతో సాగే ఈ పాట 90శాతం జనాలకు అర్థంకాదు. కానీ వినడానికి పాట బాగుంది. తన తండ్రి శివదత్తా రాసిన సాహిత్యానికి కీరవాణి బాణీకట్టారు. అక్కడక్కడ పాతతరం వాయిద్యాలు వాడి కంపోజ్ […]

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే?
X

మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసిన కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ టైటిల్ ఇదే) ఇప్పుడు పాటల మీద పడ్డాడు. ఇందులో భాగంగా ఈరోజు బయోపిక్ పార్ట్-1 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. “ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా” అనే సాహిత్యంతో సాగే ఈ పాట 90శాతం జనాలకు అర్థంకాదు. కానీ వినడానికి పాట బాగుంది.

తన తండ్రి శివదత్తా రాసిన సాహిత్యానికి కీరవాణి బాణీకట్టారు. అక్కడక్కడ పాతతరం వాయిద్యాలు వాడి కంపోజ్ చేసిన ఆ పాటను బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ఆలపించాడు. పూర్తిగా గ్రాంధిక పదాలతో వచ్చిన ఈ పాటలో సాహిత్యం ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఇలాంటి పదాల్ని తెలుగు తెలియని కైలాష్ ఖేర్ అనే వ్యక్తి పాడిన విధానం మాత్రం అద్భుతం అని చెప్పాలి. ఎక్కడా ఒత్తులు మిస్ అవ్వకుండా, పొల్లుపోకుండా చక్కగా పాడాడు కైలాష్ ఖేర్.

ఈ రోజు విడుదలైన ఈ పాట సినిమా స్టార్టింగ్ లో వచ్చే టైటిల్స్ వెనక బ్యాక్ డ్రాప్ లో వస్తుందని టాక్. ఇకపై దశలవారీగా ఎన్టీఆర్-కథానాయుకుడు పాటల్ని విడుదల చేయబోతున్నారు. రెండు భాగాల్లో, బిట్ సాంగ్స్ తో కలుపుకొని ఏకంగా 14 పాటలున్నాయట. వీటిలో ప్రేక్షకులకు తెలిసిన “ఆకుచాటు పిందె తడిసె” లాంటి సూపర్ హిట్ సాంగ్స్ 5 ఉన్నాయట.

First Published:  2 Dec 2018 2:13 PM IST
Next Story